Begin typing your search above and press return to search.

మహేష్‌ క్రికెట్‌ టీమ్‌? అంత సీన్‌ లేదు

By:  Tupaki Desk   |   17 July 2015 6:11 PM IST
మహేష్‌ క్రికెట్‌ టీమ్‌? అంత సీన్‌ లేదు
X

ఇకపోతే ''వైజాగ్‌ సిక్సర్స్‌'' టాక్‌ పై పూర్తిగా నీళ్ళు చల్లేసారు మహేష్‌ బాబు బావగారు.. ఆల్రెడీ షారూఖ్‌ ఖాన్‌ అక్కడ కోలకత్తాలో కూర్చుని సిక్స్‌ కొట్టమంటూ సందడి చేస్తున్నాడు. ప్రీతి జింతా పంజాబ్‌ ప్లేయర్స్‌కు హగ్స్‌ ఇస్తూ ఎంకరేజ్‌ చేస్తోంది. శిల్పా శెట్టి టీమ్‌ను రెండేళ్ళు బహిష్కరించారు. సెలబ్స్‌ ఇలా క్రికెట్‌తో రకరకాలుగా వార్తల్లోకి వస్తుంటే.. మరి మన మహేష్‌ బాబు కూడా ఒక ఐపిఎల్‌ టీమ్‌ కొంటాడనే న్యూస్‌ బయటకు వచ్చేసరికి అందరూ ఎక్సయిట్‌ అయిపోయాం. కాని చివరకు అంత సీన్‌ లేదని తెలుస్తోంది.

అసలు మహేష్‌ బాబు కాని, ఆయన బావ.. తెలుగుదేశం ఎంపి గల్లా జయదేవ్‌ కాని ఎటువంటి ఐపిఎల్‌ టీమ్‌ను కొనట్లేదట. అసలు వైజాగ్‌ కోసం ఒక టీమ్‌ ఉందని, ఆ టీమ్‌లో తాము పెట్టుబడులు పెట్టడం కాని, కొనడం గాని అనే విషయాల గురించి తమకే ఏమీ తెలియదని చెప్పారు గల్లా జయదేవ్‌. అంతేకాదు.. ఇలాంటి రూమర్లు అన్నీ పబ్లిసిటీ చేయకండి అంటూ మొట్టికాయలు కూడా వేశారు. ఇకపోతే మహేష్‌ బాబును క్రికెట్‌ గ్రౌండ్‌లో చూడాలనుకున్న అభిమానుల ఆశలు ఆవిరైపోయాయ్‌. అయినా.. ఐపిఎల్‌ టీమ్‌ అంటే మాటలు ఏంటండీ.. దానికి వందల కోట్లు కావాలి.. అంత ఇన్వెస్ట్‌మెంట్‌ పెట్టినా కూడా.. లాభాలు వస్తాయనే నమ్మకం లేదట.