Begin typing your search above and press return to search.

ఫస్ట్ బీర్ మహేష్ తో షేర్ చేసుకున్నాడట..!

By:  Tupaki Desk   |   12 Jan 2022 3:30 PM GMT
ఫస్ట్ బీర్ మహేష్ తో షేర్ చేసుకున్నాడట..!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా ''హీరో'' అనే సినిమాతో ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 15న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అశోక్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన మేనమామ మహేష్ గురించి.. ఆయనతో ఉన్న అనుబంధం గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

అశోక్ మాట్లాడుతూ.. ''ఆయన ఈ ప్రపంచంలోనే మోస్ట్ ఫ్రీ పర్సన్ అని చెప్పవచ్చు. ఆయనతో కొంచం ఫ్రెండ్ షిప్ కుదిరితే చాలు డిఫరెంట్ వరల్డ్ ని చూపిస్తారు. ఈ ప్లానెట్ లో ఆయనకన్నా ఫ్రీగా ఫన్నీగా ఎవరూ ఉండరు. డిన్నర్ లేదా లంచ్ టైంలో ఆయనొస్తే ఇంక నవ్వులే. ఆయన చుట్టూ ఉన్నవాళ్ళని ఎనర్జిటిక్ గా ఉంచుతారు. చాలామందికి ఈ విషయం తెలియదు. ఆయనతో క్లోజ్ గా ఉన్నవాళ్ళకి మాత్రమే ఇవన్నీ తెలుస్తాయి'' అని అన్నారు.

''నేను వయసులోకి వచ్చాక ఇంట్లో ఫ్యామిలీ పార్టీలో ఫస్ట్ బీర్ ఆయన ఉన్నప్పుడు తాగాను. అప్పుడు 'నువ్వు బీర్ తీసుకుంటున్నావా?' అంటూ ఆయన ఓ ఫన్నీ ఎక్స్ ప్రెషన్ ఇచ్చారు. ఆ ఎక్స్ ప్రెషన్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను సైలెంట్ గా సిప్ చేస్తూ పక్కకి తిరిగాను. అప్పుడు నా వయస్సు 18 ఏళ్ళు'' అంటూ తన మామయ్యతో ఫన్నీ ఇన్సిడెంట్ ని అశోక్ షేర్ చేసుకున్నాడు.

కాగా, సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తున్న మూడో తరం హీరో అశోక్ సినిమా కోసం అభిమానులు వేచి చూస్తున్నారు. ''హీరో'' చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఇందులో అశోక్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. జగపతిబాబు - నరేష్ - వెన్నెల కిశోర్ - బ్రహ్మాజీ - కోట శ్రీనివాస్ - సత్య - అర్చన సౌందర్య - కౌశల్య - మైమ్‌ గోపి - అజయ్‌ - ప్రభాకర్‌ ఇతర పాత్రల్లో నటించారు.

కృష్ణ మరియు గల్లా అరుణకుమారి సమర్పణలో అమ‌ర్‌ రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌ పై ప‌ద్మావ‌తి గ‌ల్లా ఈ చిత్రాన్ని నిర్మించారు. చంద్రశేఖర్ రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. జిబ్రాన్ సంగీతం సమకూర్చారు. సమీర్ రెడ్డి - రిచర్డ్ ప్రసాద్ ల సినిమాటోగ్రఫీ అందించగా.. ప్రవీణ్‌ పూడి ఎడిటింగ్ వర్క్ చేశారు. లవ్ - యాక్షన్ - కామెడీ - రొమాన్స్ వంటి అన్ని అంశాలతో కంప్లీట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ''హీరో'' ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.