Begin typing your search above and press return to search.

వెండి తెరపై మహారాణి క్లియోపాత్ర జీవితం

By:  Tupaki Desk   |   14 Oct 2020 3:00 PM IST
వెండి తెరపై మహారాణి క్లియోపాత్ర జీవితం
X
ఈజిప్టు మహారాణి క్లియోపాత్ర ప్రపంచంలోనే అత్యంత ధైర్యవంతురాలు మరియు సాహసవంతురాలు అంటూ పేరు దక్కించుకున్నారు. ఆమె ధైర్యం సాహసంతో పాటు అందం కూడా అమితంగా ఉన్న మహారాణి. అందుకే ఆమె వరల్డ్ ఫేమస్‌ అయ్యారు. అలాంటి మహారాణి జీవితంను వెండి తెరపైకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇజ్రాయిల్‌ కు చెందిన గాల్‌ గాడోట్‌ మహారాణి క్లియోపాత్ర గా కనిపించేందుకు సిద్దం అయ్యింది. గాల్‌ గాడోట్‌ హాలీవుడ్‌ లోనే ప్రముఖ నటి. ఆమె ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించాడు.

మహారాణి క్లియోపాత్ర జీవితంలో నటించేందుకు గాల్‌‌ గాడోట్‌ పూర్తిగా అర్హురాలు. ఆమె అందంను మ్యాచ్‌ చేయడంతో పాటు అన్ని విధాలుగా ఆమె బాడీ లాంగ్వేజ్‌ ను సైతం గాడోట్‌ మ్యాచ్‌ చేస్తుందనే నమ్మకంను ఫిల్మ్‌ మేకర్స్‌ వ్యక్తం చేస్తున్నారు. క్లియో పాత్ర జీవితంను మహిళ కోణంలో రూపొందించబోతున్నట్లుగా మేకర్స్‌ పేర్కొన్నారు. ఒక మహిళ తన జీవితంలో సాధించిన విజయాలు ఎదుర్కొన్న సవాళ్లను ఈ సినిమాలో చూపపిస్తూ కథ సాగుతుందని అన్నారు.

హాలీవుడ్‌ లో ఇప్పటికే క్లియోపాత్ర సినిమా వచ్చింది. ఎలిజబెత్‌ టైలర్‌ నటించిన ఆ సినిమా 1963లో వచ్చింది. ఆ సినిమాకు అప్పట్లో నాలుగు ఆస్కార్‌ లు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు క్లియోపాత్ర జీవితంను కొత్త కోణంలో చూపించబోతున్నాం అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన గాల్‌ గాడోట్‌ ట్విట్టర్‌ ద్వారా చేసింది. ఈ సినిమాకు ప్యాటీ జెన్కిన్స్‌ దర్శకత్వం వహించబోతుంది.