Begin typing your search above and press return to search.

ఈ `వండ‌ర్ ఉమెన్` ముగ్గురు బిడ్డ‌ల త‌ల్లి అంటే న‌మ్మ‌గ‌ల‌రా?

By:  Tupaki Desk   |   30 Jun 2021 1:30 PM GMT
ఈ `వండ‌ర్ ఉమెన్` ముగ్గురు బిడ్డ‌ల త‌ల్లి అంటే న‌మ్మ‌గ‌ల‌రా?
X
వండర్ వుమన్ ఫ్రాంఛైజీతో వ‌రుస‌ సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న‌ ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టి గాల్ గాడోట్ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఇది ఆమెకు మూడో సంతానం. 36 ఏళ్ల గాల్ గాడోట్ ప్ర‌ఖ్యాత‌ డీసీ సూపర్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్న సంగ‌తి తెలిసిందే.

తన మూడవ బిడ్డకు స్వాగతం పలికిన సంద‌ర్భంగా ఇన్ స్టాగ్రామ్ లో స్వీట్ ఫ్యామిలీ ఫోటోతో సంతోషకర విష‌యాన్ని ప్రకటించింది. ఇలా జ‌న్మ‌నివ్వ‌గానే అలా త‌న కూతురు పేరు `డేనియెల్లా` అంటూ ప్ర‌క‌టించారు గాల్‌. ఫోటోలో గాల్ భర్త యారోన్ వర్సానో (ఆమె 2008 లో వివాహం చేసుకున్నారు) వారి కుమార్తెలు మాయ- అల్మా స‌హా మూడో కుమార్తెతో కలిసి క‌నిపించారు. గాల్ గాడోట్ కి అమెరికా కోడ‌లు ప్రియాంక చోప్రా జోనాస్ ఈ శుభ‌సంద‌ర్భాన‌ ``అభినందనలు`` తెలిపారు.

మార్చిలో త‌న గ‌ర్భాన్ని ప్ర‌క‌టించిన గాల్ గాడోట్ ఏప్రిల్ 2021లో ఓ చానెల్ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ త‌న‌కు బేబి గాళ్ జ‌న్మిస్తుంద‌ని ఛ‌మ‌త్క‌రించారు. ``మమ్మీ కడుపులో పాపా ఒక విత్తనాన్ని నాటారు. కాబట్టి మేము దానిని చూస్తున్నాం. పక్షులు తేనెటీగలు మనకు ఎలా తెలుసో.. మూడవ బిడ్డ ఆడా మగా అన్న‌ది కూడా అలానే తెలిసిపోతుంది`` అంటూ గాల్ గాడోట్ చానెల్ లైవ్ లో న‌వ్వులు చిందించారు.