Begin typing your search above and press return to search.

గద్దలకొండ గణేష్ ను హిట్ గా తేల్చారు!

By:  Tupaki Desk   |   23 Sept 2019 8:00 PM IST
గద్దలకొండ గణేష్ ను హిట్ గా తేల్చారు!
X
హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో తెర్కక్కిన 'గద్దలకొండ గణేష్' సెప్టెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుణ్ మేకోవర్.. ఇంట్రెస్టింగ్ ప్రోమోలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రం రిలీజ్ తర్వాత కూడా దాదాపుగా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. కొన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ ఓవరాల్ గా కమర్షియల్ ఎలిమెంట్స్ ను కరెక్ట్ గా రంగరించడంతో మాస్ ఆడియన్స్ కు కనెక్ట్ అయింది.

సినిమా మొదటి వారాంతంలో డీసెంట్ కలెక్షన్స్ నమోదు చేసి బ్రేకీవెన్ దిశగా దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా ఫలితం గురించి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనే ఉద్దేశంతో మేము ఒక పోల్ ను నిర్వహించాం. ఈ పోల్ లో పాల్గొని ఓటు వేసిన తుపాకి పాఠకులలో 64% మంది 'గద్దలకొండ గణేష్' ను 'హిట్' అని తేల్చారు. యావరేజ్ ఫిలిం అని 14% మంది అభిప్రాయపడగా.. అతి తక్కువగా 6 శాతం 'ఫ్లాప్' అని ఓటు వేయడం జరిగింది. 14% రీడర్స్ 'ఇంకా సినిమాను చూడలేదు' అని వెల్లడించారు. ఓవరాల్ గా పోల్ రిజల్టును గమనిస్తే 'గద్దలకొండ గణేష్' కు ప్రేక్షకులనుండి మంచి ఆదరణ దక్కుతోందనే విషయం స్పష్టం అయినట్టే.

మా పోల్ ను.. పోల్ లో వచ్చిన ఓట్లను ఒకసారి పరిశీలించండి..

*గద్దలకొండ గణేష్ (వాల్మీకి) మూవీపై మీ అభిప్రాయం ఏమిటి?

హిట్: 89055 (64.09%)

యావరేజ్: 20439 (14.71%)

ప్లాప్: 8703 (6.26%)

ఇంకా సినిమా చూడలేదు: 20763 (14.94%)