Begin typing your search above and press return to search.
'ట్విట్టర్'లో పంజా ఝుళిపించిన గబ్బర్ ఫ్యాన్స్!
By: Tupaki Desk | 12 May 2020 6:30 PM ISTఏ ఇండస్ట్రీ అయినా కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు దుమ్ము రేగ్గొట్టడానికి అని నిరూపించిన సినిమా గబ్బర్ సింగ్. మార్కెట్‌లో గబ్బర్ సింగ్ ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వస్తుంది.. పదేళ్లు వరస ఫ్లాపులు వచ్చిన తర్వాత కూడా ఏ హీరోకైనా ఫ్యాన్స్ పెద్దగా అంచనాలు పెట్టుకోరు. కానీ పవర్ స్టార్ విషయంలో అలా కాలేదు. నేను ట్రెండ్ ఫాలో అవ్వను.. ట్రెండ్ సెట్ చేస్తానని చెప్పినా పవన్.. వరుస ఫ్లాపుల తర్వాత కూడా సంచలనం సృష్టించాడు. అందుకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2012లో ఓ సంచలనం అయ్యాడు. గబ్బర్ సింగ్ సినిమా వచ్చి అప్పుడే 8 ఏళ్లైంది. కానీ గబ్బర్ సింగ్ జోరు తగ్గలేదు.
అదే మరి పవన్ కళ్యాణ్ అంటే.. అంటున్నారు ఫ్యాన్స్. 2012లో పవన్ కళ్యాణ్ అసలు సిసలైన విజయం అందుకున్నారు. గబ్బర్ సింగ్ వచ్చి 8 ఏళ్ళైయిందంటే.. నిన్నగాక మొన్నే వచ్చినట్లు అన్పిస్తుంది. 2012 మే 11న ఈ చిత్రం విడుదలైంది. అప్పట్లోనే ఈ చిత్రం 69 కోట్ల షేర్ వసూలు చేసింది. పవన్ ఇమేజ్ తో పాటు హరీష్ శంకర్ టేకింగ్.. అంత్యాక్షరి ఎపిసోడ్.. కబడ్డి ఎపిసోడ్.. దేవీ శ్రీ ప్రసాద్ పాటలు.. శృతిహాసన్ గ్లామర్ అన్నీ సూపర్ గా వర్కౌట్ అయ్యాయి. అప్పటి వరకు వరస ప్లాపుల్లో ఉన్న పవన్ కళ్యాణ్.. ఈ చిత్రంతో బాక్సాఫీస్ పైకి తన పంజా విసిరాడు. గబ్బర్ సింగ్ తో పవర్ స్టార్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది.
ఇక నిర్మాత గణేష్ ఈ చిత్రంతో స్టార్ ప్రొడ్యూసర్ అయిపోయాడు. ఆదివారం మొదలైన గబ్బర్ సింగ్ హ్యాష్ ట్యాగ్ మీద 24గంటలలో కోటి 38 లక్షల ట్వీట్లు వేశారు. టాలీవుడ్లోనే కాదు.. ఇండియా మొత్తంలో లార్జెస్ట్ మూవీ ట్రెండ్ గబ్బర్ సింగే సెట్ చేసింది. ఇప్పటిదాకా 10 మిలియన్ల మార్కును కూడా ఎవరూ అందుకోలేదు.. అలాంటిది పవన్ ఫ్యాన్స్ ఏకంగా 13.8 మిలియన్లతో సరికొత్త రికార్డు నెలకొల్పారు. హీరోల ఫ్యాన్స్‌కు ఇలా ట్రెండ్స్‌లో రికార్డులు నమోదు చేయడం ఇదే ప్రతిష్టాత్మకం. ఈ రికార్డు పవన్ కే సాధ్యమని ఫ్యాన్స్ నిరూపించారు.