Begin typing your search above and press return to search.

అదే రోజున 'గబ్బర్ సింగ్' కాంబో రెండో సినిమా.. రానుందా??

By:  Tupaki Desk   |   12 March 2021 3:30 PM GMT
అదే రోజున గబ్బర్ సింగ్ కాంబో రెండో సినిమా.. రానుందా??
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడు హరీష్ శంకర్ మేకింగ్ స్టైల్ వేరు. మాస్ కమర్షియల్ మూవీస్ తీయడంలో మంచిగుర్తింపు దక్కించుకున్నాడు. అయితే పదేళ్లక్రితం హరీష్ పవర్ పవన్ కళ్యాణ్ తో రూపొందించిన 'గబ్బర్ సింగ్' ఎలాంటి బ్లాక్ బస్టర్ అందుకుందో అందరికి తెలిసిందే. ఆ సినిమాతో హరీష్ శంకర్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. కానీ గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ మళ్ళీ అంతటి విజయాన్ని అందుకోలేదు. లాస్ట్ 'గద్దలకొండ గణేష్' సినిమాతో హిట్ అందుకున్నాడు. అయితే మరోసారి పవన్ కళ్యాణ్ తో హిట్టు కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. పవన్ కళ్యాణ్ కోసం మంచి మాస్ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట హరీష్. వీరి కాంబోలో సినిమా రాబోతుందంటేనే అభిమానులలో అంచనాలు భారీస్థాయికి చేరుకున్నాయి.

అయితే ఫ్యాన్స్ కూడా గబ్బర్ సింగ్ లాంటి మాస్ ఎంటర్టైనర్ కోసనమే వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ అంచనాలు అందుకునే విధంగా హరీష్ శంకర్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడట. గబ్బర్ సింగ్ మూవీ 2012 వేసవిలో వసూళ్ల వర్షం కురిపించింది. తాజా సమాచారం ప్రకారం.. మళ్లీ పదేళ్లకు అదే వేసవిలో వీరి కాంబో మూవీతో పలకరించేందుకు రంగం సిద్ధం అవుతోందట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాను రీమేక్ కథతో కాకుండా సొంతకథతో తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు హరీష్ శంకర్. వినోదంతో పాటు సందేశం కూడా ఉంటుందని టాక్ నడుస్తుంది. అయితే ఈ సినిమా జూన్ లేదా జులైలో సెట్స్ పైకి వెళ్తుందని సినీవర్గాలు చెబుతున్నాయి. అలాగే సినిమా 2022 వేసవిలో అదే మే 11న సినిమా విడుదల చేసే అవకాశం ఉందంటూ వార్తలొస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా పై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.