Begin typing your search above and press return to search.

'గానా ఆఫ్ రిపబ్లిక్' సాంగ్: స్వేచ్ఛ ని ఓ అమ్మాయిలా ఊహించుకుని పాడితే..!

By:  Tupaki Desk   |   10 July 2021 12:36 PM GMT
గానా ఆఫ్ రిపబ్లిక్ సాంగ్: స్వేచ్ఛ ని ఓ అమ్మాయిలా ఊహించుకుని పాడితే..!
X
సుప్రీమ్ హీరో సాయి తేజ్‌ - డైరెక్టర్ దేవ కట్టా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ''రిపబ్లిక్''. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌ పై జె.భగవాన్ - జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో సాయి తేజ్ కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ - మోషన్ పోస్టర్ - టీజర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా సినిమాలోని 'గానా ఆఫ్ రిపబ్లిక్' అనే ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

'హేయ్ రారో.. హేయ్ రారో.. నా ప్రాణంలోని ప్రాణం.. నా దేహంలోని దాహం.. నా మౌనం పాడే గానం.. నా ప్రశ్న సమాధానం' అంటూ సాగే ఈ పాట శ్రోతలను అలరిస్తోంది. సంగీత బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ ఈ పాటకు అందరూ పాడుకునే విధంగా క్యాచీ ట్యూన్ సమకూర్చారు. స్వేచ్ఛ ని ఓ అమ్మాయిలా ఊహించుకొని కాలేజీలో కుర్రాళ్ళు పాడుకునేలా థీమ్ తో గేయ రచయిత రెహమాన్ లిరిక్స్ రాశారు. ఈ యూత్ ఫుల్ సాంగ్ ని యువ గాయకులు అనురాగ్ కులకర్ణి - ధనుంజయ్ - హైమత్ మహ్మద్ - ఆదిత్య అయ్యంగర్ - పృథ్వీ చంద్ర కలసి ఆలపించారు.

'గానా ఆఫ్ రిపబ్లిక్' థీమ్ సాంగ్ కు రాజు సుందరం మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఇందులో సాయి తేజ్ వేసిన స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. సాంగ్ విడుదల సందర్భంగా సాయి తేజ్ ట్వీట్ చేస్తూ.. మణిశర్మ తో మొదటిసారి వర్క్ చేస్తున్నందుకు సంతోషంగా ఉందని.. దీని కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. 'రిపబ్లిక్' చిత్రంలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తోంది. రమ్యకృష్ణ - జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎమ్.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. కేఎల్ ప్రవీణ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.