Begin typing your search above and press return to search.

ఆకట్టుకుంటున్న గాలిసంపత్ 'ఫిఫిఫీ..' ఫస్ట్ సింగిల్!

By:  Tupaki Desk   |   17 Feb 2021 1:06 PM IST
ఆకట్టుకుంటున్న గాలిసంపత్ ఫిఫిఫీ.. ఫస్ట్ సింగిల్!
X
టాలీవుడ్ యువహీరో శ్రీవిష్ణు, రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న సినిమా గాలిసంపత్. వినోదాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పకుడిగా వ్యవహరిస్తూనే స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న గాలిసంపత్ నుండి తాజాగా ఫస్ట్ సాంగ్ విడుదల చేశారు మేకర్స్. 'ఫిఫిఫీ ఫిఫిఫీ' అంటూ సాగే ఈ కామెడీ ఎంటర్టైనింగ్ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్ లో ఉంది. పోటుగాడు, కరెంటుతీగ మూవీస్ ఫేమ్ అచ్చు రాజమణి సంగీతం అందించిన ఈ పాట సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మంచి మెలోడీ సంగీతానికి సరిపోయే లిరిక్స్ పడితే ఎలా ఉంటుందో అలాంటి లిరిక్స్ అందించాడు రామజోగయ్యశాస్త్రి.

'రాజరాజశ్రీ గాలిసంపత్ గారు.. మై డియర్ డాడీ బాబండి..' అంటూ చాలా వినోదభరితమైన క్యాచి పదాలతో సాంగ్ రచించారు శాస్త్రి. అందుకు తగ్గట్టుగానే ఎంటర్టైనింగ్ గా ఆలపించాడు సింగర్ రాహుల్ నంబియర్. అచ్చు అందించిన ట్యూన్ కూడా చాలా కొత్తగా ఉంది. చాలా గ్యాప్ తర్వాత అచ్చు మళ్లీ సినిమాకు సంగీతం సమకూర్చుతున్నాడు. ఇక ఈ సినిమాలో శ్రీవిష్ణు, రాజేంద్రప్రసాద్ తండ్రికొడుకులుగా నటిస్తున్నారు. పాట వింటే రోజు ఏదొక ప్రాబ్లెమ్ తీసుకొచ్చే క్యారెక్టర్లో రాజేంద్రప్రసాద్.. జనాలకు సర్దిచెప్పే కొడుకుగా శ్రీవిష్ణు కనిపిస్తారని అనిపిస్తుంది. ఇదిలా మార్చ్ 11న తెరమీదకు రాబోతున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్, ఇమేజ్ స్పార్క్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చూడాలి మరి గాలిసంపత్ పాటలాగే సినిమా కూడా ఆకట్టుకుంటుందేమో!