Begin typing your search above and press return to search.

ప్రేమ కథలనే నమ్ముకున్న 'జీఏ2 పిక్చ‌ర్స్'..!

By:  Tupaki Desk   |   4 Jun 2021 8:00 AM IST
ప్రేమ కథలనే నమ్ముకున్న జీఏ2 పిక్చ‌ర్స్..!
X
మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ 'గీతా ఆర్ట్స్' సంస్థకు అనుబంధంగా 'జీఏ 2 పిక్చ‌ర్స్' బ్యానర్ ను స్థాపించి మీడియం బడ్జెట్ సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రొడక్షన్ హౌస్ నిర్వహణ బాధ్యతలు నిర్మాత బన్నీ వాస్ చూసుకుంటున్నారు. జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో ఇప్పటి వరకు వచ్చిన '100% ల‌వ్', 'భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌', 'గీతగోవిందం', 'టాక్సీవాలా', 'ప్ర‌తిరోజు పండ‌గే' వంటి చిత్రాలు ఘ‌న‌ విజయాలు సాధించాయి. ఇలా వరుస విజయాలు అందుకుంటూ సక్సెస్ కు మారుపేరుగా నిలిచిన ‌బన్నీ వాసు.. ఇటీవల 'చావు కబురు చల్లగా' సినిమాతో పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు 'జీఏ 2 పిక్చ‌ర్స్' సంస్థలో మూడు సినిమాలు రెడీ అవుతున్నాయి. అవే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్', 'ప్రేమ‌ కాదంట‌', '18 పేజెస్' చిత్రాలు.

అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని రెడీగా ఉంది. పుజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా యూత్ ఫుల్ లవ్ తో రూపొందుతోంది. రాకేష్ శశి దర్శకత్వంలో అల్లు శిరీష్ - అను ఇమ్మాన్యూయేల్ జంటగా నటిస్తున్న సినిమా 'ప్రేమ‌ కాదంట‌'. ఇదొక న్యూ ఏజ్ ల‌వ్ స్టోరీ అని ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో అర్థమైంది. ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని అర్థం అవుతోంది. లవ్ అండ్ లివింగ్ రిలేష‌న్ షిప్ నేప‌థ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.

ఇకపోతే నిఖిల్ సిద్ధార్థ్ - అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తున్న చిత్రం '18 పేజెస్'. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రానికి కథ - స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఇది కూడా ఒక వైవిధ్యమైన ప్రేమ కథా చిత్రం అని తెలుస్తోంది. ఇలా జీఏ2 పిక్చ‌ర్స్ బ్యానర్ లో ప్రస్తుతం రూపొందుతున్న మూడు సినిమాలు కూడా ప్రేమ కథలే కావడం గమనార్హం. ప్రేమ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న గీతా ఆర్ట్స్2.. ఇప్పుడు ప్రేమ క‌థ‌ల‌తోనే మూడు వరుస హిట్స్ కొడతామని నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది.