Begin typing your search above and press return to search.

చల్ ‘తమన’ రంగా అనిపించాడే

By:  Tupaki Desk   |   24 Feb 2018 10:15 AM IST
చల్ ‘తమన’ రంగా అనిపించాడే
X
లాస్ట్ ఇయర్ ఘనంగా చెప్పుకోదగ్గ హిట్ లేని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు కొత్త సంవత్సరం బాగా కలిసి వస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో తనది ఒక్కటి కూడా లేకపోయినా టాలీవుడ్ మొదటి హిట్ భాగమతి తన ఖాతాలోనే పడింది. అందులో ఉన్నది ఒకటే పాట అయినా థీమ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టిన తమన్ అ సినిమా విజయంలో తనవంతు కీలక పాత్ర పోషించాడన్నది నిజం. తర్వాత ఫిబ్రవరిలో తొలిప్రేమతో మరో సూపర్ సక్సెస్ అందుకున్న తమన్ తన జోరుని ఇకపై కూడా ఫుల్ గా సాగించేలా ఉన్నాడు. దానికి సాక్ష్యంగా నితిన్ కొత్త సినిమా చల్ మోహనరంగా ఆల్బం నిలిచేలా ఉంది.

మేఘా మేఘా అంటూ ఈ రోజు విడుదల చేసిన ఆడియో ట్రాక్ కి యూత్ నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తోంది. పాట ప్రారంభంలో నితిన్ మేగా అని పిలిస్తే హీరొయిన్ మేఘా ఆకాష్ వాయిస్ లో 'మేగా' కాదు 'మేఘా' అని 'ఘా' ని వత్తి వత్తి పలికాక కంటిన్యూ కావడం కొత్తగా అనిపించింది. రాహుల్ నంబియార్ వాయిస్ లో ఫ్రెష్ నెస్ వినిపించగా ప్రతి లైన్ లో ఘాతో ముగించిన కృష్ణ కాంత్ లిరిక్స్ భలే క్యాచీగా వెంటనే అందుకునేలా ఉన్నాయి. ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ కి తమన్ మరోసారి బెస్ట్ ఆప్షన్ లా మారడం ఖాయం అనిపిస్తోంది ఈ సాంగ్ వింటే. జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాకు త్రివిక్రమ్ తమన్ ను తీసుకోవడం వెనుక కూడా చల్ మోహనరంగా అవుట్ పుట్టే కారణమని ఇన్ సైడ్ టాక్. రచయిత దర్శకుడు కృష్ణ చైతన్య రౌడీ ఫెలో తర్వాత ఐదేళ్ళ గ్యాప్ తీసుకుని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఆడియో ట్రాక్ తో అంచనాలు ఇంకా పెరిగాయి.