Begin typing your search above and press return to search.
టాప్ స్టోరి: టాలీవుడ్ భవిష్యత్ స్టార్ వార్
By: Tupaki Desk | 19 March 2020 5:00 AM ISTటాలీవుడ్ లో వారసుల ఎంట్రీ పరిపాటే. తండ్రులు ఫామ్ లో ఉండగానే తనయులు ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నారు. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని అటుపై సొంతగా పైకి ఎదుగుతున్నారు. చిరంజీవి తనయుడు రామ్ చరణ్...నాగార్జున తనయులు నాగచైతన్య.. అఖిల్ - హరికృష్ణ తనయుడు ఎన్టీఆర్... వెంకటేష్ వారసత్వాన్ని అందుకుని రానా..కృష్ణం రాజు వారసత్వంతో అతని అన్న బిడ్డ ప్రభాస్ ఇలా ఒక జనరేషన్ హీరోలుగా టాలీవుడ్ ని ఏల్తున్నారు. ప్రస్తుతం వీళ్లంతా టాలీవుడ్ లో టాప్ స్టార్లుగా కొనసాగుతున్నారు.
పోటా పోటీగా రేసులో పరుగులు పెడుతున్నారు. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కూడా రేపో.. మాపో జరుగుతుందనేది అభిమానుల ఆశ. దానిపై సరిగా క్లారిటీ రాలేదింకా. మోక్షు ఎంట్రీ తర్వాత ఇంకెవరుంటారు? అన్నది వెతికితే .. మెగా వంశం నుంచి వారసులు బరిలో దిగే ఛాన్సుంటుంది. చిరంజీవి సమకాలిక హీరోల వారసుల ఎంట్రీ ఉండే ఛాన్సుంది. అటుపై ఆ తరువాతి తరం మొదలువుతంది. అంటే పవన్ కళ్యాణ్ తనయుడు కొణిదెల అకీరా నందన్.. అలాగే బన్ని వారసులు బరిలో దిగే వీలుంటుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ తనయుడు ..ఘట్టమనేని వారసుడు గౌతమ్ ల పోటీకి ఆస్కారం ఉంటుంది. వీళ్లిద్దరు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తే ఇద్దర మధ్య గట్టి పోటీ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇద్దరు స్టార్ కిడ్స్ కాబట్టి ప్రేక్షకాభిమానుల్లో అంచనాలు తారా స్థాయిలోనే ఉంటాయి. ఇక నందమూరి వంశం నుంచి జూనియర్ ఎన్టీఆర్ తనయులు అభయ్ రామ్..భార్గవ్ రామ్ బరిలో నిలిచే ఛాన్స్ ఉంది. అయితే వీళ్లందరిలో అకీరా నందన్ వయసులో పెద్దవాడు. కాబట్టి తనే సీనియర్ అవుతాడు...అకీరా టాలీవుడ్ ఎంట్రీ పై ఇప్పటికే కథనాలు వస్తున్నాయి. పవన్ రాజకీయాల్లో బిజీ అయిన నేపథ్యంలో అభిమానుల కోసం అకీరాని ఏ క్షణమైనా లాంచ్ చేసే ఛాన్స్ ఉందని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఈ ఫ్యూచర్ స్టార్స్ ఫోటోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి.
ఇక హీరో నాని వారసుడు కూడా ప్రస్తుతం రెడీ అవుతున్నాడు కాబట్టి అతడికి ఓ ఛాయిస్ ఉంటుంది. తనతో పాటే అల్లరి నరేష్..వారసుడికి.. మంచు మనోజ్ .. లక్ష్మీ ప్రసన్న వారసులకు స్కోప్ ఉంటుంది ఇండస్ట్రీలో.