Begin typing your search above and press return to search.

'ఏక్ మినీ కథ' నుంచి ఫన్నీ 'సామిరంగా' సాంగ్..!

By:  Tupaki Desk   |   21 April 2021 4:50 AM GMT
ఏక్ మినీ కథ నుంచి ఫన్నీ సామిరంగా సాంగ్..!
X
'పేపర్ బాయ్' ఫేమ్ సంతోష్ శోభన్ - కావ్యా థాపర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ''ఏక్ మినీ కథ''. 'డజ్‌ సైజ్‌ మ్యాటర్‌?' అంటూ ప్రమోషన్స్ చేస్తూ వస్తున్న చిత్ర బృందం.. ఫస్ట్ లుక్ - టీజర్ తో సినిమాపై ఆసక్తిని కలిగించారు. అలానే ఇటీవల విడుదలైన 'ఈ మాయలో..' లిరికల్ సాంగ్ కూడా మంచి స్పందన తెచ్చుకుంది. ఈ క్రమంలో శ్రీరామనవమి సందర్భంగా తాజాగా సెకండ్ సాంగ్ 'సామిరంగా..' లిరికల్ వీడియోని చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.

'సామి రంగా.. పరేషానీ జీవితం.. తస్సాదియ్యా.. ఊరుకోరే ఈ జనం.. పిల్లకన్నీ పెద్ద కలలే.. చిన్నబోయా నాలోనేనే..' అంటూ సాగిన ఈ ఫన్నీ సాంగ్ శ్రోతలను విశేషంగా అలరోస్తోంది. దీనికి ప్రవీణ్ లక్కరాజు ఆహ్లాదకరమైన ఫ్రెష్ ట్యూన్ కంపోజ్ చేశారు. ఇక ఈ చిత్రంలో హీరో ఎదుర్కొనే సమస్యకు తగ్గట్లు లిరిసిస్ట్ శ్రీజో చమత్కారమైన సాహిత్యం అందించగా.. సింగర్ పృథ్వీ చంద్ర తనదైన శైలిలో అలపించారు. ఈ లిరికల్ వీడియో ఫన్నీగా ఉంటూ అందరిని ఆకట్టుకుంటోంది.

కాగా, కొత్త దర్శకుడు కార్తీక్ రాపోలు తెరకెక్కిస్తున్న 'ఏక్ మినీ కథ' సినిమాని యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై రూపొందిస్తున్నారు. మ్యాంగో మాస్ మీడియా వారు సమర్పిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి స్టోరీ అందించారు. ఇందులో శ్రద్ధాదాస్ కీలక పాత్ర పోషిస్తుండగా.. బ్రహ్మాజీ - సుదర్శన్ - సప్తగిరి - హర్షవర్ధన్ ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందించగా.. సత్య ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. 'ఏక్ మినీ కథ' చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు కానీ, కొవిడ్ నేపథ్యంలో వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.