Begin typing your search above and press return to search.

లావ‌ణ్య‌ను అరెస్ట్ చేయాల‌న్న అభిమాని!

By:  Tupaki Desk   |   25 Jan 2018 9:25 AM GMT
లావ‌ణ్య‌ను అరెస్ట్ చేయాల‌న్న అభిమాని!
X
తాను అమితంగా అభిమానించి.. ఆరాధించే న‌టికి సంబంధించి ఆస‌క్తిక‌ర ట్వీట్ ఒక‌టి చేసి అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాడో అభిమాని. ఇంత‌కీ ఆ న‌టి ఎవ‌రంటారా? ఇంకెవ‌రూ.. అంత‌కంత‌కూ అందంతో కుర్ర‌కారు మ‌న‌సుల్ని కేజీల చొప్పున కొల్ల‌గొడుతున్న లావ‌ణ్య త్రిపాఠి. ఆమెను అభిమానించే అభిమాని ఒక‌రు ఆమెను ఇప్ప‌టికిప్పుడు అరెస్ట్ చేయాల‌ని ట్వీట్ చేశాడు.

దానికి స్పందించిన లావ‌ణ్య.. న‌వ్వేస్తూ రిప్లై ఇచ్చింది. అరెస్ట్ చేయాలంటూ పోస్ట్ పెడితే న‌వ్వ‌టం ఏమిటంటారా? ఇక్క‌డే ఉంది అస‌లు విష‌యం. ఇంత‌కూ జ‌రిగిందేమంటే.. తాజాగా మెగా క్యాంప్ హీరో సుప్రీం సాయి ధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న ఇంటిలిజెంట్ మూవీలో న‌టిస్తున్న లావ‌ణ్య త్రిపాఠి.. తాజాగా ఒక ఫోటోను విడుద‌ల చేసింది.

ఎల్లో క‌ల‌ర్ గౌన్ లో దిగిన ఈ ఫోటోలో క్యూట్ గా ఉన్న ఆమెను ట్యాగ్ చేసిన వ‌రుణ్ రెడ్డి అనే అభిమాని.. అందంగా ఉండ‌టం నేర‌మైతే ఇప్ప‌టికిప్పుడు లావ‌ణ్య‌ను అరెస్ట్ చేయండి.. త‌న అందంతో ఆమె చంపేస్తోందంటూ ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన లావ‌ణ్య‌... హా.. హా.. మా నాన్న లాయ‌ర్ అంటూ స‌ర‌దాగా బ‌దులిచ్చింది.

అభిమానించే న‌టిని వెరైటీగా పొగిడేసిన అభిమాని ట్వీట్‌కు లావ‌ణ్య రిప్లై ఇవ్వ‌టం.. వీరిద్ద‌రి సంభాష‌ణ ఇప్పుడు వైర‌ల్ గా మారింది.