Begin typing your search above and press return to search.
సెన్షేషనల్ మూవీ పుకార్లన్నింటికి ఫుల్ స్టాప్
By: Tupaki Desk | 9 May 2020 11:00 AM ISTకమల్ హాసన్, శంకర్ ల కాంబినేషన్ లో రెండు దశాబ్దాల క్రితం వచ్చిన భారతీయుడు ఒక సెన్షేషన్. ఆ చిత్రం తర్వాత ఇద్దరు కూడా పెద్ద స్టార్స్ అయ్యారు. సౌత్ ఇండియాలోనే కాకుండా వీరిద్దరికి పాన్ ఇండియా గుర్తింపు ఉంది. అందుకే భారతీయుడు చిత్రానికి సీక్వెల్ మొదలు పెట్టారు. లైకా ప్రొడక్షన్స్ వారు రెండు వందల కోట్లకు పైచిలుకు బడ్జెట్ తో ఇండియన్ 2 ను ప్రారంభించారు. దర్శకుడు శంకర్ మరో అద్బుతంను ఆవిష్కరించేందుకు అంతా సిద్దం చేసుకున్నాడు.
ఇండియన్ 2 చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులకు నిరాశ కలిగిస్తూ పలు సార్లు సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే గత ఏడాదిలోనే సినిమా రావాల్సి ఉంది. కాని ఏవో కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చింది. ఆమద్య షూటింగ్ సెట్ లో క్రేన్ ప్రమాదం జరగడంతో అసలు సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు మొదలు అయ్యాయి.
చిత్ర నిర్మాతలు.. దర్శకుడు.. హీరోకు మద్య వివాదాలు మొదలయ్యాయి. దాంతో సినిమా మళ్లీ పట్టాలు ఎక్కడం కష్టమే అన్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దర్శకుడు శంకర్ తన తదుపరి చిత్రంను విజయ్ తో ప్లాన్ చేస్తున్నాడు అంటూ ప్రచారం మొదలైంది. ఇండియన్ 2 చిత్రం గురించి ఆశ పెట్టుకోక పోవడం మంచిదనే కథనాలు తమిళ మీడియాలో జోరుగా వచ్చిన నేపథ్యంలో తాజాగా లైకా ప్రొడక్షన్స్ వారు స్పందించారు. 60 శాతం షూటింగ్ పూర్తి అయిన ఇండియన్ 2 ను ఎలా ఆపేస్తాం.
వంద కోట్లకు పైగా ఖర్చు చేశాం. అన్ని కోట్లు ఖర్చు చేసి మద్యలో ఎలా వదిలేస్తాం అంటూ లైకా ప్రతినిధులు చెప్పుకొచ్చారు. లాక్ డౌన్ ఎత్తివేసి షూటింగ్స్ కు అనుమతించిన వెంటనే సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని అన్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ను అధికారికంగా వెళ్లడి చేస్తామంటూ పుకార్లన్నింటికి కూడా వారు ఫుల్ స్టాప్ పెట్టారు. ఈ చిత్రంలో హీరోయిన్స్ గా కాజల్ మరియు రకల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న విషయం తెల్సిందే. పలువురు స్టార్స్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.