Begin typing your search above and press return to search.
హీరోయిన్లు డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడించిన FSL నివేదిక..!
By: Tupaki Desk | 24 Aug 2021 5:00 PM ISTదేశ వ్యాప్తంగా సంచలనం రేపిన శాండిల్ వుడ్ డ్రగ్స్ రాకెట్ లో నటీమణులు సంజన గల్రానీ - రాగిణి ద్వివేది లను బెంగుళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బెయిల్ పై విడుదలైన ఈ ఇద్దరు హీరోయిన్లకు ఈ కేసులో ఉచ్చు బిగుస్తోందని తెలుస్తోంది. రాగిణి - సంజనలు డ్రగ్స్ తీసుకున్నట్లు FSL రిపోర్టులో తేలింది. బెంగళూరు పోలీసులు 2020 అక్టోబర్ లో ఇద్దరి వెంట్రుకలను FSLకు పంపగా.. ఈ హీరోయిన్లు డ్రగ్స్ సేవించినట్లు నివేదిక ద్వారా స్పష్టమైంది. దీంతో మరోసారి రాగిణి - సంజన లకు సమన్లు జారీ చేయనున్నట్లు బెంగళూరు పోలీసులు తెలిపారని కన్నడ సినీ వర్గాలు చెబుతున్నాయి.
కాగా, కన్నడ చిత్ర సీమలో అనేకమంది ప్రముఖులు నిషేధిత డ్రగ్ యూజర్లేనని బెంగుళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో రాగిణి ద్వివేది - సంజన గల్రాని లతో పాటు డ్రగ్స్ తో సంబంధం ఉన్న పలువురుని సీసీబీ అరెస్టు చేసింది. మాదకద్రవ్యాల వినియోగం - సరఫరా కేసులో సెప్టెంబర్ 7న రాగిణి ద్వివేదిని.. సెప్టెంబర్ 9న సంజనను అరెస్ట్ కాబడ్డారు. ఇద్దరూ 3 నెలలకు పైగా బెంగుళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉండి బెయిల్ పై బయటికి వచ్చారు.
డ్రగ్స్ కేసులో రాగిణి ద్వివేది - సంజనా గల్రాని తో పాటు మరో 25 మందిపై చార్జిషీట్ ఫైల్ అయింది. 2019 మే 26న రాగిణి ద్వివేది బర్త్ డే పార్టీలో డ్రగ్స్ సరఫరా చేయడం.. ప్రియుడు రవిశంకర్ తో కలసి ఓ హోటల్ లో నిర్వహించిన పార్టీలో ఎక్స్‌టసీ డ్రగ్ మాత్రలు తీసుకోవడం.. ఇతరులకూ సరఫరా చేయడం వంటి వాటిని ఈ చార్జిషీట్ లో ప్రస్తావించారు. అలానే సంజన కు డ్రగ్స్ వినియోగం మరియు సరఫరాతో సంబంధం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇప్పుడు FSL రిపోర్టులో హీరోయిన్లు ఇద్దరూ డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడైంది.