Begin typing your search above and press return to search.
సినిమా ప్రొడక్షన్ లోకి దిగుతున్న ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్...!
By: Tupaki Desk | 26 July 2020 8:00 AM ISTఅల్లు అర్జున్ ప్రస్తుతం స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ తో 'పుష్ప' అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో 'అల వైకుంఠపురంలో' సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన బన్నీ 'పుష్ప'తో కంటిన్యూ చేస్తాడని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ఇప్పటికే 'పుష్ప' నుండి రిలీజైన అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత బన్నీ స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కొరటాల చెప్పిన స్టోరీ లైన్ బన్నీకి బాగా నచ్చిందని.. బన్నీని దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ వర్క్ డెవలప్ చేసే పనిలో కొరటాల ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప'.. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న 'ఆచార్య' సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయని చెప్పుకుంటున్నారు.
కాగా కొరటాల శివ - బన్నీ కాంబోలో తెరకెక్కపోయే చిత్రాన్ని బన్నీ మాతృ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించనున్నారట. అయితే అల్లు అరవింద్ తో పాటు బన్నీ స్నేహితులు కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగస్వాములు కాబోతున్నారట. అయితే వీరు సపరేట్ ప్రొడక్షన్ హౌస్ పెడతారా లేదా గీతా ఆర్ట్స్ తో కలిసి పెట్టుబడులు పెడతారా అనేది తెలియాల్సి ఉంది. స్నేహితులను సినిమా ప్రొడక్షన్స్ లోకి తీసుకురావడం అనేది ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు. ఇప్పటికే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన కజిన్ మరియు స్నేహితులను ప్రొడ్యూసర్స్ గా ఎంకరేజ్ చేసి యూవీ క్రియేషన్స్ బ్యానర్ పెట్టించారు. 'సాహో' సినిమా మరియు ప్రస్తుతం తెరకెక్కుతున్న 'రాధే శ్యామ్' చిత్రాలు సైతం యూవీ క్రియేషన్స్ బ్యానర్ పైనే చేస్తున్నారు ప్రభాస్.
అలానే త్రివిక్రమ్ శ్రీనివాస్ తన స్నేహితులు రాధాకృష్ణ (చిన బాబు) కోసం వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇక అల్లు అర్జున్ కూడా ఇంతకముందు తన దగ్గరి బంధువైన వెంకటేశ్వరరావుని 'రేసుగుర్రం' ప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ చేసారు. ప్రస్తుతం బన్నీ నటిస్తున్న 'పుష్ప' సినిమాని కూడా మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు తన రిలేటివ్స్ ముత్యంశెట్టి మీడియా వారు కలిసి నిర్మిస్తున్నారు. కొరటాల శివ సైతం తన ఫ్రెండ్ సుధాకర్ కోసం సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. మొత్తం మీద ఇండస్ట్రీలో తమ ఫ్రెండ్స్ ని బంధువులని సినిమా ప్రొడక్షన్స్ లోకి దింపుతున్నారని అర్థం అవుతోంది.