Begin typing your search above and press return to search.

ఎమ్ ఎస్ రాజు సెంటిమెంట్ 'ఫ్రైడే మూవీస్' కి కలిసొస్తుందా..?

By:  Tupaki Desk   |   12 Dec 2020 11:30 AM GMT
ఎమ్ ఎస్ రాజు సెంటిమెంట్ ఫ్రైడే మూవీస్ కి కలిసొస్తుందా..?
X
డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ సందడి మొదలైన తర్వాత అనేక కొత్త ఓటీటీలు - ఏటీటీలు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చాయి. ఇండిపెండెంట్ సినిమాలు వెబ్ సిరీస్ లతో పాటు కొత్త సినిమాలను కూడా డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదల చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఏటీటీలకు తోడుగా ఇప్పుడు 'ఫ్రైడే మూవీస్' అనే మరో కొత్త డిజిటల్ వేదిక వీక్షకులకు అందుబాటులోకి వస్తోంది. ఒక్క ఫోన్ చేస్తే చాలు సినిమా చూడొచ్చు అనే కొత్త కాన్సెప్ట్ తో ఈ యాప్ ఆడియెన్స్ కు అందుబాటులోకి వ‌స్తోంది. ముందుగా ఈ యాప్ లో ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు దర్శకత్వం వహించిన 'డర్టీ హరి' చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 18న ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ పెడుతున్నారు. అయితే ఫ్రైడే మూవీస్ ఏటీటీ ఎమ్ ఎస్ రాజు సెంటిమెంట్ వారికి కూడా వర్కౌట్ అవుతుందని ఆశపడుతున్నారని తెలుస్తోంది.

కాగా, ఎమ్ ఎస్ రాజు నిర్మాణంలో చేసిన సినిమాల ద్వారా అప్ప‌ట్లో ప్ర‌భాస్ - మ‌హేశ్ బాబు - దేవిశ్రీ ప్రసాద్ - త్రిష‌ - సిద్ధార్థ్ వంటి వారు ఆ త‌రువాత పెద్ద పెద్ద స్టార్లు అయ్యారు. ఈ మాదిరిగానే ఎమ్ ఎస్ రాజు డైరెక్ష‌న్ లో వస్తున్న 'డ‌ర్టీ హ‌రి' సినిమా కూడా త‌మ ఫ్రైడే మూవీస్ యాప్ లాంఛ్ అవుతుంద‌ని.. అప్ప‌ట్లో వారి ద‌గ్గ‌ర ప‌నిచేసిన సెంటిమెంట్ ఇప్పుడు త‌మ యాప్ విష‌యంలో కూడా నిజమవుతుందని ఈ యాప్ వారు ఆశ‌ప‌డుతున్నారట. 'డర్టీ హరి' మూవీతో పాటే కొన్ని అప్ క‌మింగ్ సినిమాలు కూడా ఫ్రైడే మూవీస్ యాప్ ద్వారా రిలీజ్ అవ్వ‌బోతున్నాయి. కొత్త ఆలోచనలతో వస్తున్న ఫ్రైడే మూవీస్ మిగతా ఏటీటీలకు పోటీనిచ్చి సక్సెస్ అవుతుందేమో చూడాలి.