Begin typing your search above and press return to search.

ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై ఫ్రైడే సందడి!

By:  Tupaki Desk   |   4 Feb 2022 10:30 AM GMT
ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై ఫ్రైడే సందడి!
X
ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై ఇప్పుడు ఫుల్ ట్రాఫిక్ కనిపిస్తోంది. ఏ ఫ్లాట్ ఫామ్ మీద ఏది ఉందో చెక్ చేసుకుని ఆ దిశగా ప్రయాణం చేయడానికి అందరూ ఆసక్తిని చూపుతున్నారు. ఈ రోజున ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో కొన్ని మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మరింతగా ఉత్సాహాన్ని పెంచడానికి కారణమవుతున్నాయి. 'లూప్ లపేట' సినిమా ఈ రోజు నుంచి 'నెట్ ఫ్లిక్స్' లో స్ట్రీమింగ్ కానుంది. సోనీ పిక్చర్స్ .. ఎలిప్సిస్ ఎంటర్టైన్మెంట్ వారు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి ఆకాశ్ భాటియా దర్శకత్వం వహించారు. తాప్సీ .. తాహిర్ రాజ్ భాసిన్ ప్రధానమైన పాత్రల్లో కనిపించనున్నారు.

థ్రిల్లర్ జోనర్లో సాగే ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి ఉంది. అందువలన ఈ సినిమా కోసం కాచుకుని కూర్చున్నవారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఇక మహేశ్ అభిమానులంతా చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఆయన 'అన్ స్టాపబుల్' ఎపిసోడ్ ఈ రోజు నుంచే 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ టాక్ షో ప్రోమో వాళ్లలో విపరీతమైన ఆత్రుతను పెంచుతూ వచ్చింది. 'నా సినిమాలోని డైలాగ్ ఒకటి నువ్వు చెబితే వినాలని ఉంది' అని బాలయ్య అంటే, 'మీ డైలాగ్ ను మీరు తప్ప ఎవరూ చెప్పలేరు సార్' అని మహేశ్ సమాధానం ఇచ్చిన తీరు అందరికీ విపరీతంగా నచ్చేసింది.

ఇక 'అన్ స్టాపబుల్' ఫస్టు సీజన్ లో ఇదే చివరి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ కోసం అందరూ ఉత్సాహంగా ఎదురుచూడటానికి అది కూడా ఒక కారణం. ఈ ఎపిసోడ్ ఒక రేంజ్ లో దూసుకెళుతుందని అంతా భావిస్తున్నారు. ఇక సోనీ లివ్ లో 'రాకెట్ బాయ్స్'తో సందడి చేయనుంది. విభిన్నమైన కథాకథనాలతో సాగే ఈ డ్రామా సిరీస్ కూడా ఈ రోజు నుంచే స్ట్రీమింగ్ కానుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ డ్రామా సిరీస్ కుతూహలాన్ని రేకెత్తిస్తూ వచ్చింది.

'ది గ్రేట్ ఇండియన్ మర్డర్' క్రైమ్ డ్రామా సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ రోజు నుంచే స్ట్రీమింగ్ చేస్తున్నారు. మొత్తానికి ఈ ఫ్రైడే కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ను కళ్లముందు వడ్డించనుందన్న మాట.