Begin typing your search above and press return to search.

సెకండ్ యాంగిల్ ని చెప్పరేం

By:  Tupaki Desk   |   25 Jun 2016 4:38 PM IST
సెకండ్ యాంగిల్ ని చెప్పరేం
X
ఇండియన్ యాక్ట్రెస్ అయినా.. అమెరికన్, బ్రిటిష్ సినిమాల్లో సత్తా చాటుతున్న ఫ్రిదా పింటో.. సల్మాన్ ఖాన్ చేసిన రేప్ కామెంట్స్ వివాదంపై స్పందించింది. ఒక మహిళగా ఈ తరహా వ్యాఖ్యలను ఖండిస్తున్నానని.. చాలా బాధ పెట్టాయని చెప్పిన ఈ స్లమ్ డాగ్ మిలియనీర్ యాక్టర్.. మీడియా కొంత బాధ్యతగా ఉండాలని కూడా చెప్పింది.

'తప్పులు ప్రతీ వాళ్లూ చేస్తారు. మనుషులు తప్పులు చేయకుండా ఉండరు. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ సల్మాన్ మాట్లాడినది తప్పే అయినా.. ఆ వెంటనే తప్పుగా మాట్లాడనని గ్రహించి.. తన మాటను వెనక్కి తీసుకున్నాడు. తన ఉద్దేశ్యం అది కాదంటూ స్పష్టంగా చెప్పాడు. కానీ సల్మాన్ రేప్ కామెంట్స్ పై తప్ప.. వివరణపై కానీ, ఆ తర్వాత మాటలపై కానీ మీడియా పబ్లిసిటీ చేయడం లేదు' అంటూ అసహనం వ్యక్తం చేసింది ఫ్రిదా పింటో. తప్పును చూపించేందుకు ఉత్సాహం చూపించే మీడియా.. దాని తర్వాత జరిగిన పరిణామాలను చూపించకపోవడం, చెప్పకపోవడం కరెక్ట్ కాదన్నది ఫ్రిదా వెర్షన్.

ఇక్కడ సల్మాన్ ను సపోర్ట్ చేయడం లేదని.. అలాగని మీడియా కూడా సరిగ్గా బాధ్యతతో ప్రవర్తించడం లేదని చెప్పిందీ హాలీవుడ్ హీరోయిన్. అసలు ఒక ఖాన్ ఏదో అన్న మాటను పట్టుకుని దానిపై ఇంతగా చర్చలు చేపట్టే బదులు.. మహిళలకు అసలు విలువ దక్కని పరిస్థితుల గురించి, వారి ఇబ్బందుల గురించి మనసు పెట్టాలని కదా అంటోంది ఫ్రిదా పింటో.