Begin typing your search above and press return to search.
పాన్ ఇండియా స్టార్ ఇలాంటి పబ్లిసిటీ సరి కాదేమో?
By: Tupaki Desk | 31 Dec 2020 10:15 AM ISTకేజీఎఫ్ లాంటి భారీ పాన్ ఇండియా సినిమాతో సంచలనాలు సృష్టించాడు కన్నడ రాకింగ్ స్టార్ యష్. ఒక ఆర్టీసీ బస్ డ్రైవర్ కొడుకు ఇంతటి ఘనతను సాధించారు అనగానే ప్రపంచం మొత్తం అతడి వైపు చూసింది. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి స్వయంగా కేజీఎఫ్ యష్ కి ఇచ్చిన ప్రచారం అంతా ఇంతా కాదు. దీంతో అతడిపై తెలుగు-తమిళం-మళయాలం సహా హిందీ పరిశ్రమ దృష్టి ప్రసరించింది.
ఇప్పుడు అదే కేజీఎఫ్ సీక్వెల్ బిజినెస్ కి అన్ని భాషల్లో పెద్ద ప్లస్ కానుంది. ప్రశాంత్ నీల్ - హోంబలే బృందం రాజీ అన్నదే లేకుండా కేజీఎఫ్ 2ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో అధీరగా సంజయ్ దత్ నటించడంతో హిందీ బెల్ట్ లోనూ ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం అన్ని మార్కెట్లలోనూ కేజీఎఫ్ 2 బిజినెస్ పెద్ద స్థాయిలో జరుగుతుందన్న అంచనా ఉంది.
అయితే ఇలాంటి సమయంలో తన సతీమణి రాధికా పండిట్ తో కలిసి యష్ ఓ ఆయిల్ బ్రాండ్ కి సోషల్ మీడియాల్లో ప్రచారం చేయడం అభిమానులకు నచ్చడం లేదు. అతడి రేంజుకు ఇంతకుమించిన పెద్ద బ్రాండ్లు క్యూ కట్టేస్తాయి. కేజీఎఫ్ స్టార్ గా అతడు తనని తాను తక్కువ చేసుకుంటున్నాడా? అన్న ఆందోళన అభిమానుల్లో కనిపిస్తోంది. ఇలాంటి చమురు బ్రాండ్లకు అంత పెద్ద స్టార్ ప్రమోషనా? అంటూ విస్మయం కనిపిస్తోంది.
నిజానికి కేజీఎఫ్ తో వచ్చిన ఘనతను యష్ నిలబెట్టుకోలేకపోతున్నాడని అభిమానులు భావిస్తున్నారు. కానీ యష్ మాత్రం డౌన్ టు ఎర్త్ తనవైపు వచ్చిన బ్రాండ్లకు ప్రచారం చేస్తున్నారని కూడా భావించవచ్చు. అయితే అతడి వైపు నేషనల్ .. ఇంటర్నేషనల్ రేంజ్ బ్రాండ్లు క్యూ కట్టేందుకు ఇంకెంతో సమయం పట్టదన్న అంచనా ఏర్పడిన ఇలాంటి సందర్భంలో చమురు ప్రచారం సరికాదేమోనన్నదే ఆందోళన. ప్రతి ఒక్కరూ కేజీఎఫ్ స్టార్ కదలికల్ని గమనిస్తున్నప్పుడు ఇలాంటి చిన్నవి చేయకూడదన్నది ఒక సెక్షన్ విశ్లేషణ.