Begin typing your search above and press return to search.

బూతుల కాలేజీకి ఫ్రీ పబ్లిసిటీ

By:  Tupaki Desk   |   8 May 2019 12:20 PM IST
బూతుల కాలేజీకి ఫ్రీ పబ్లిసిటీ
X
ఇటీవలే విడుదలైన డిగ్రీ కాలేజీ ట్రైలర్లో కంటెంట్ కంటే అందులో ఉన్న బోల్డ్ నెస్ కే బోలెడు ప్రచారం తెచ్చేసుకుంది. మాటలు మరీ పచ్చిగా ఉండటం శృంగారాన్ని ఏకంగా క్లాస్ రూమ్ లోకి చొప్పించి హద్దులు దాటిన సెక్స్ ని చూపించడం మీద ఇప్పటికే చాలా విమర్శలు చెలరేగాయి. దీని ట్రైలర్ లాంచ్ కు వచ్చిన జీవిత ఏకంగా స్టేజి మీదే దీని గురించి క్లాస్ పీకడం సోషల్ మీడియాలో సైతం బాగా వైరల్ అయ్యింది.

దర్శక నిర్మాతలు ఎంతగా సమర్ధించుకుంటున్నప్పటికీ పైకి కనిపిస్తున్న నిజాలు కాదనలేరుగా. ఇప్పుడు ఇదే ఈ సినిమాకు వరంగా మారుతోంది. లెక్కలేనన్ని యుట్యూబ్ ఛానల్స్ లో దీని గురించిన టాక్ తో విశ్లేషణలతో హోరెత్తిపోయింది. దర్శకుడు నరసింహ నందితో ఇంటర్వ్యూలు చేసేందుకు అవన్నీ తెగ ఉత్సాహం చూపిస్తున్నాయి. ట్రైలర్ ని ఆధారం చేసుకుని రకరకాలుగా విషయాన్నీ రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి

ఇదంతా టీమ్ కు బాగా ఉపయోగపడుతోంది. నెగటివ్ గా వెళ్తున్నా సినిమాకు కావలసిన ప్రచారం దక్కి ట్రైలర్ ను చూస్తున్న వాళ్ళ సంఖ్యా పెరుగుతోంది. కంటెంట్ వేరుగా ఉంటుందని ట్రైలర్ లో చూపించింది కేవలం కమర్షియల్ అంశాలు ఉన్నాయని చెప్పేందుకే అని దర్శకుడు కవర్ చేసుకున్నా ముక్కు మొహం తెలియని హీరో హీరొయిన్లున్న సినిమా గురించి ఈ మాత్రం చర్చ జరుగుతోంది అంటే ఆ మసాలా పుణ్యమేగా. కల్ట్ క్లాసిక్ అని తనకు తాను చెప్పుకుంటున్న నరసింహ నంది సెన్సార్ గండాన్ని ఎలా దాటుకుంటారో వేచి చూడాలి