Begin typing your search above and press return to search.

కొత్త విలన్ కనెక్ట్ అవుతాడట

By:  Tupaki Desk   |   10 Jan 2018 8:59 AM GMT
కొత్త విలన్ కనెక్ట్ అవుతాడట
X
ప్రస్తుతం టాలీవుడ్ లో చాలా వరకు విలన్స్ విషయంలో మన దర్శకులు చాలా ప్రయోగాలు చేస్తున్నారు. మొన్నటి వరకు లోకల్ విలన్స్ బాగానే ఉండేవారు కానీ ఇప్పుడు పరభాషా విలన్స్ పై మన దర్శకులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. విలన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే.. హీరో స్థాయి అంత పెరుగుతుందా అని మన రచయితలు కూడా విలన్స్ కోసం డైలాగ్స్ ని స్పెషల్ గా రాస్తున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే.. త్వరలో మన తెలుగు ఇండస్ట్రీలోకి మరో కొత్త విలన్ రాబోతున్నాడు.

అతను ఎవరో కాదు ఫోర్స్ 2 - హాలిడే లాంటి బాలీవుడ్ బాక్స్ అఫీస్ సినిమాల్లో కనిపించి అందరిని చాలా ఆకట్టుకున్న ఫ్రెడ్డి దారువాలా. ఈ యాక్టర్ రవితేజ - టచ్ చేసి చూడు సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇటీవల సినిమా గురించి కొన్ని విషయాలను ఇంటర్యూలో తెలిపాడు. ఫ్రెడ్డీ మాట్లాడుతూ.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను అందరికి కనెక్ట్ అయ్యే పాత్రతోనే రాబోతున్నాను. దర్శకుడు విక్రమ్ సిరికొండ చాలా బాగా తెరకెక్కించాడు. సినిమాలో ప్రతి సన్నివేశం చాలా కొత్తగా ఉంటుంది. రవితేజ ఎనర్జిటిక్ పర్ఫెమెన్స్ సినిమాకు చాలా ప్లస్.

తెలుగు ఇండస్ట్రీలో దర్శకులు చాలా వరకు ప్రయోగాలు చేస్తుంటారు. ఇక్కడి యక్షన్ సీన్స్ చాలా వరకు నాకు బాగా నచ్చుతాయి. టాలీవుడ్ లో వచ్చే సినిమాలు నేను చూస్తుంటాను అని ఇంకా మంచి అవకాశాలు వస్తే చేయడానికి సిద్ధమని ఫ్రెడ్డీ తెలిపారు. మరి ఈ కొత్త విలన్ మన ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అవుతాడో చూడాలి. ఇక టచ్ చేసి చూడు సినిమా దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొన్ని మిగిలి ఉన్నాయి. ఇటీవల టీజర్ ని కూడా రిలీజ్ చేశారు. ఇక సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేసే అవకశాలు ఉన్నట్లు తెలుస్తోంది.