Begin typing your search above and press return to search.

విశ్వనటుడిని ఢీ కొట్టనున్న నలుగురు విలన్స్..!

By:  Tupaki Desk   |   30 Jun 2021 9:00 AM IST
విశ్వనటుడిని ఢీ కొట్టనున్న నలుగురు విలన్స్..!
X
2018లో 'విశ్వరూపం 2' సినిమాని విడుదల చేసినవిశ్వనటుడు కమల్ హాసన్.. ఆ తర్వాత వెండితెరపై కనిపించలేదు. శంకర్ దర్శకత్వంలో 'ఇండియన్ 2' చిత్రాన్ని స్టార్ట్ చేసినా అనుకోని వివాదాల్లో చిక్కుకొని, ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడింది. ఈ నేపథ్యంలో లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో ''విక్రమ్'' అనే యాక్షన్ థ్రిల్లర్ మొదలు పెట్టారు కమల్. ఇప్పటికే రిలీజ్ చేయబడిన టైటిల్ - ఫస్ట్ గ్లిమ్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది. భారీ స్థాయిలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో యాక్షన్ కు పెద్ద పీట వేస్తున్నట్లు తెలుస్తోంది.

''విక్రమ్'' సినిమాలో కమల్ ని ఢీకొట్టడానికి నలుగురు ప్రతినాయకులు ఉంటారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ను ఒక విలన్ రోల్ కోసం తీసుకున్నారు. ఇప్పుడు మేకర్స్ మిగతా ముగ్గురు విలన్స్ ను ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారట. ఈ నేపథ్యంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ని కూడా సంప్రదిస్తున్నారని అంటున్నారు. సేతుపతి ఆల్రెడీ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన 'మాస్టర్' సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

ఇకపోతే 'కేజీఎఫ్' చిత్రానికి ఫైట్స్ కంపోజ్ ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్స్ అన్బు-అరివ్.. 'విక్రమ్' చిత్రానికి యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నాడు. 'ఖైదీ' 'మాస్టర్' వంటి వరుస విజయాలు అందుకున్న లోకేష్.. ఈ సినిమాలో కమల్ ను కొత్త అవతారంలో ప్రెజెంట్ చేయబోతున్నారు. ఫస్ట్ గ్లిమ్స్ లో ఇప్పటికే దీనిపై హింట్ ఇచ్చారు. విశ్వనటుడి కెరీర్ లో 232వ సినిమాగా 'విక్రమ్' రూపొందుతోంది. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత ఇటీవలే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారభమైంది.