Begin typing your search above and press return to search.
ముంబైలో ఆ నలుగురు టాలీవుడ్ దర్శకుల భేటీ
By: Tupaki Desk | 24 Aug 2021 5:00 AM ISTముంబైలో ఆ నలుగురు సమావేశమై ఏం ముచ్చటించారు? ఈ ఫోటోలో టాలీవుడ్ దర్శకులు పూరి జగన్నాధ్- క్రిష్- చిరంజీవి గాడ్ ఫాదర్ డైరెక్టర్ జయం మోహన్ రాజా - నిశ్శబ్దం డైరెక్టర్ హేమంత్ మధుకర్ ఉన్నారు. ముంబైలోని ఒక రెస్టారెంట్ లో వీరంతా ఏం చర్చిస్తున్నారు? అంటూ అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల్లోనూ గుసగుసగా మారింది.
ఈ చిత్రాన్ని తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ నటి కం నిర్మాత చార్మీ ఈ దర్శకులు ఏమనుకుంటున్నారో ఊహించమని తన అభిమానులను అడిగారు. అభిమానుల అంచనాల ప్రకారం తమ సినిమాల పొజిషనింగ్ పై ఆ నలుగురు చర్చించి ఉంటారని భావిస్తున్నారు. పూరి లైగర్.. క్రిష్ హరి హర వీర మల్లు .. జయం మోహన్ రాజా గాడ్ ఫాదర్ (చిరు) గురించి చర్చలు జరిగాయని గెస్ చేస్తున్నారు. అయితే అసలు విషయం వారికి .. ఛార్మీకి మాత్రమే తెలుసు. ఆ సీక్రెట్ ఏదో ఓపెన్ అవుతారేమో చూడాలి.
ఈ సన్నివేశం చూస్తుంటే మునుముందు పాన్ ఇండియా మార్కెట్ కి కీలకమైన హిందీ మార్కెట్ ని వశం చేసుకునేందుకు ఎలాంటి ఎత్తుగడలు వేయాలి? తెలుగు దర్శకులంతా ఒకే గొడుగు కిందికి వచ్చి భారీ డీల్స్ ని ఎలా సెట్ చేయాలి? లాంటి లాజికల్ థింకింగ్ పైనా చర్చించి ఉంటారని అంచనా వేస్తున్నారు.