Begin typing your search above and press return to search.

బ‌ర్త్ డే వ‌స్తే నాలుగైదు సినిమాలు ప్రకటిస్తున్నారు సరే.. వాటిని ఎప్పుడు.. ఎక్క‌డ రిలీజ్ చేయాలి?

By:  Tupaki Desk   |   7 July 2021 8:00 AM IST
బ‌ర్త్ డే వ‌స్తే నాలుగైదు సినిమాలు ప్రకటిస్తున్నారు సరే.. వాటిని ఎప్పుడు.. ఎక్క‌డ రిలీజ్ చేయాలి?
X
కరోనా కారణంగా గతేడాది సినిమా ఇండస్ట్రీ మొత్తం స్తంభించిపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో పరిస్థితులు చూసి అంతా బాగానే ఉంది అనుకుంటుండగా.. మళ్ళీ కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చి దెబ్బేసింది. దీంతో థియేటర్లు మూతపడటం.. వేసవిలో విడుదల కావాల్సిన సినిమాలన్నీ వాయిదా పడటం జరిగింది. షూటింగ్ లకు అనుమతులు రావడంతో చిత్రీకరణ దశలో ఉన్న సినిమాలన్నీ తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ల్యాబ్ లో ఉన్న సినిమాలతో పాటుగా మరికొన్ని చిత్రాలు రిలీజ్ రెడీ అవుతున్నాయి.

ఇక టాలీవుడ్ హీరోలంతా వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారని తెలుస్తోంది. స్టార్ హీరోలు.. మీడియం రేంజ్ హీరోలు.. అస‌లు ఫామ్ లో లేని హీరోలు.. బ‌డ్డింగ్ హీరోలలు.. ఇలా అందరూ ఒక్కొక‌రు నాలుగైదు సినిమాలు చేస్తున్నారని తెలుస్తోంది. హీరోల పుట్టినరోజులు వచ్చినప్పుడు అస‌లు వారు ఎన్ని సినిమాల్లో నటిస్తున్నారనే విషయం తెలిసిపోతుంది. ఇటీవల బర్త్ డేలు జరుపుకున్న హీరోలకు శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ వరుస సినిమాలు అనౌన్స్ చేయడం చూశాం. ఈ లెక్క‌న చూస్తే రాబోయే రోజుల్లో మన హీరోల నుంచి మరిన్ని సినిమాలు రాబోతున్నాయని అర్థం అవుతోంది.

ఇండస్ట్రీలో పరిస్థితి చూస్తే ఓ వైపు థియేట‌ర్లు మూసేసి ఉన్నారు.. ఓ వైపు ఓటీటీలు స‌రిగ్గా సినిమాలు కొన‌డం లేదు.. కొనడానికి ముందుకు వచ్చినా కూడా థియేటర్స్ తెరుస్తారేమో అనే ఆశతో నిర్మాతలు ఉన్నారు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ వల్ల వాయిదా పడిన సినిమాలతో పాటుగా మరికొన్ని సినిమాలు రెడీ అయిపోతే వీటన్నింటిని ఎప్పుడు రిలీజ్ చేయాలి? ఎక్క‌డ చేయాలి? అనే ప్ర‌శ్న‌లు ఇప్పుడు ఫిల్మ్ న‌గ‌ర్ స‌ర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ సినిమాలన్నీ బయటకు రాకపోతే ఇండ‌స్ట్రీ మొత్తం తీవ్ర‌మైన న‌ష్టాల్లోకి వెళ్లిపోతుందని సినీ నిపుణులు చెబుతున్నారు.