Begin typing your search above and press return to search.

ఫోర్ సైడ్ వార్ - ఏడు రోజుల గ్యాప్

By:  Tupaki Desk   |   12 March 2019 1:30 AM GMT
ఫోర్ సైడ్ వార్ - ఏడు రోజుల గ్యాప్
X
ఫిబ్రవరి మార్చిలో వచ్చిన సినిమాల్లో ఏవి బాక్స్ ఆఫీస్ కు మరీ ఎక్కువ జోష్ ని ఇవ్వలేకపోయాయి. యాత్ర పర్వాలేదు అనిపించినా మహానాయకుడు సహా మిగిలినవన్నీ టపా కట్టేశాయి. ఒకటి ఆరా తప్ప ఏది కనీస స్థాయిలో ఆడకపోవడంతో ముఖ్యంగా బిసి సెంటర్స్ లో ఎగ్జిబిటర్లు లబోదిబోమంటున్నారు. చాలా చోట్ల బయట పోస్టర్లు మాత్రమే ఉంటాయి. లోపల షోలను రద్దు చేసి సిబ్బందిని ఇతర మెయింటెనెన్స్ పనుల కోసం వాడుకుంటున్న ఉదంతాలు చాలా ఉన్నాయి.

అయితే వచ్చే నెల నుంచి సీన్ పూర్తిగా మారిపోతుంది. వారానికో మినిమమ్ బజ్ ఉన్న సినిమా సందడి చేయడానికి రెడీ అవుతోంది. అందులోనూ అందరూ యూత్ హీరోలవి కావడం విశేషం. ముందుగా ఏప్రిల్ 5 మజిలీతో నాగ చైతన్య వస్తాడు. సతీమణి సమంతాతో నటించడం ఓ ఆకర్షణ కాగా ఎమోషనల్ మూవీగా టీజర్ ని కట్ చేయడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. ఇది వచ్చిన వారం రోజులకు ఏప్రిల్ 12న సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి వస్తుంది. ఇప్పటిదాకా కనీసం ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయలేదు. వేరే ఆలోచన ఏమైనా ఉందేమో ప్రస్తుతానికి తెలియదు.

ఇంకో ఏడు రోజులు గడవడం ఆలస్యం న్యాచురల్ స్టార్ నాని 19న జెర్సితో వచ్చేస్తాడు. ఆ వెంటనే 25కు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సీత సమేతంగా అడుగు పెడతాడు. ఈ నాలుగు సినిమాల మధ్య గ్యాప్ ఏడు రోజులే. ఎవరూ వంద కోట్ల మార్కెట్ ఉన్న హీరోలు కాదు. కానీ బజ్ ఉన్న వాళ్లే. నాని ఒక్కడే కాస్త ఎక్కువ ఎడ్జ్ తో బిజినెస్ రాబట్టుకుంటాడు కానీ మిగిలిన హీరోలు సైతం వాళ్ళ రేంజ్ కు తగ్గట్టు బజ్ తెచ్చుకుంటున్నారు,. మొత్తానికి ఏప్రిల్ ఫోర్ హీరోస్ వార్ తో రసవత్తరంగా మారేలా ఉంది