Begin typing your search above and press return to search.

ఆ న‌లుగురితో పోటీలో మ‌రో న‌లుగురు యువ‌హీరోలు!

By:  Tupaki Desk   |   23 Nov 2020 10:45 AM IST
ఆ న‌లుగురితో పోటీలో మ‌రో న‌లుగురు యువ‌హీరోలు!
X
టాలీవుడ్ స్టార్ హీరోల న‌డుమ ఠ‌ఫ్ కాంపిటీష‌న్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. మ‌హేష్‌- ప్ర‌భాస్ - ఎన్టీఆర్ - రామ్ చ‌ర‌ణ్ - బ‌న్ని.. వీళ్లంతా ఉర‌క‌లెత్తే రక్తంతో పాన్ ఇండియా రేసులో దూసుకెళ్లాల‌నే పంతంతో ఉన్నారు. ప్ర‌భాస్ త‌ర్వాత ఇత‌ర హీరోలు శ‌ర‌వేగంగా పాన్ వ‌ర‌ల్డ్ (ఇండియా) టార్గెట్ తో స‌త్తా చాటాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. ఆ త‌ర్వాత కేట‌గిరీలో స‌త్తా చాటే ఉద్ధేశం ఉన్న యువ‌హీరోలకు కొద‌వేమీ లేదు.

స‌క్సెస్ రేటు.. స్ట‌డీగా సినిమాలు చేస్తూ ముందుకెళుతున్న న‌వ‌త‌రం హీరోల్ని ప‌రిశీలిస్తే స్వ‌యంకృషితో ఎదిగి రాణిస్తున్న వారిలో తొలిగా నేచుర‌ల్ స్టార్ నాని పేరు వినిపిస్తోంది. ఆ త‌ర్వాత నైజాం నుంచి దూసుకొచ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌... అలాగే నిఖిల్.. అడివి శేష్ వంటి హీరోల పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. వీరంతా ఒక‌రితో ఒక‌రు పోటీప‌డుతూ వ‌రస సినిమాలు చేస్తూ బిజీగానే ఉన్నారు.

వ‌రుస స‌క్సెస్ ల త‌ర్వాత `వి` ఫ్లాపైనా నాని ప్లానింగ్ ఓ రేంజులోనే ఉంది. వ‌రుస‌గా ట‌క్ జ‌గ‌దీష్‌-శ్యాం సింఘ‌రాయ్ చిత్రాల్లో నాని న‌టిస్తున్నాడు. వీటితో పాటు అంటే సుంద‌రానికీ! అంటూ లేటెస్టుగా మ‌రో సినిమాని ప్ర‌క‌టించేశాడు. నాని 2021లో మూడు సినిమాల‌తో బిజీ. కోవిడ్ మహమ్మారి బ్రేక్ ప‌డ‌క‌పోయినా కెరీర్ పరంగా పూర్తి బిజీగా ఉన్నాడు నాని. న‌వ‌త‌రంలో చ‌క్క‌ని ఓపెనింగులు తేగ‌లిగే స‌త్తా ఉన్న హీరోగా నాని ఇప్ప‌టికే నిరూపించుకున్నాడు. మారుతితోనూ మ‌రో సినిమాని నాని ప్లాన్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఆ త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌రుస ప్రాజెక్టుల‌కు క‌మిట‌వుతూ బిజీగా ఉన్నాడు. ఇప్ప‌టికే పూరి జ‌గ‌న్నాథ్ తో ఫైట‌ర్ చేస్తున్న దేవ‌ర‌కొండ త‌దుప‌రి.. సుకుమార్ తోనూ ఓ ప్రాజెక్టును లాక్ చేశాడు. ఇవి రెండూ భారీ ఓపెనింగుల‌తో గ్రాండ్ వెల్ కం చెప్పేవే. నానీతో బెస్ట్ ఓపెన‌ర్ గా పోటీప‌డ‌గ‌లిగే స‌త్తా దేవ‌ర‌కొండ‌కే ఉంది.

నిఖిల్ .. అడ‌వి శేష్ వంటి హీరోలు సైలెంటుగా బ్లాక్ బ‌స్ట‌ర్లు కొడుతూ స‌త్తా చాటుతూ ఇటీవ‌ల ట్రెండీ టాపిక్ అవుతున్నారు. ప‌రాజయాలు ఎదురైనా నిఖిల్ తిరిగి కంబ్యాక్ అవుతున్న తీరు ఆస‌క్తిక‌రం. రేసులో ఉన్నా శ‌ర్వానంద్ వ‌రుస ప‌రాజ‌యాలు ఇబ్బంది పెడుతున్నాయి. అయినా క్రేజీ హీరోగా వ‌రుస‌గా సినిమాల‌కు సంత‌కాలు చేస్తున్నాడు. ఒక్క బ్లాక్ బ‌స్ట‌ర్ తో బౌన్స్ బ్యాక్ అయ్యే స‌త్తా ఉన్న హీరోగా శ‌ర్వాకి గుర్తింపు ఉంది. సాయి తేజ్ ఇటీవ‌లే ప‌రాజ‌యాల నుంచి బ‌య‌ట‌ప‌డి రేస్ లోకి దూసుకొచ్చాడు. వ‌రుస ప్ర‌య‌త్నాల‌తో హీటెక్కిస్తున్నాడు. రామ్ ఇస్మార్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ తో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. రెడ్ తో స‌త్తా చాటాల‌ని ఉవ్విళ్లూరుతున్నాడు. నాగ‌శౌర్య ఫ్లాపొచ్చినా తిరిగి కంబ్యాక్ కోసం ‌సీరియ‌స్ గా ప్ర‌య‌త్నిస్తున్నాడు.

ఇక రేసులో నాని తన నిలకడ కారణంగా ఇప్పటికీ లీడ‌ర్ గా ఉన్నాడు. త‌దుప‌రి బాక్సాఫీస్ రేస్ లో వీరంతా ఎవ‌రికి వారు స‌త్తా చాటి దూసుకువ‌చ్చే విధానం కొన్ని స‌మీక‌ర‌ణాల‌కు కార‌ణ‌మ‌వుతుంద‌న‌డంలో సందేహ‌మేం లేదు.