Begin typing your search above and press return to search.

ఆ రాణులపై జనాల కామెంట్ ఏంటో!!

By:  Tupaki Desk   |   8 Sep 2017 12:30 AM GMT
ఆ రాణులపై జనాల కామెంట్ ఏంటో!!
X
బాలీవుడ్ లో హిట్టయిన 'క్వీన్‌' సినిమాను సౌత్ లో అసలు మనోళ్లు ఈ రేంజులో క్యాష్‌ చేసుకుంటారని ఆ సినిమా రైట్స్ ను అమ్మేసినప్పుడు అక్కడి నిర్మాతలు ఏమాత్రం ఊహించేఉండరు. ముఖ్యంగా దర్శకుడు వికాస్ బేల్ అయితే అస్సలు అనుకునే ఉండడు. కాని ఇప్పుడు క్వీన్ సినిమాను సౌత్ లోని నాలుగు బాషల్లో తీస్తున్నారనే సంగతి తెలిసిందే. అందుకోసం ఏకంగా నలుగురు హీరోయిన్లను కూడా సెలక్ట్ చేసుకున్నారని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం.

తెలుగులో తమన్నా.. తమిళంలో కాజల్ అగర్వాల్.. కన్నడలో పారుల్ యాదవ్.. మలయాళంలో మంజిమా మోహన్ లు 'క్వీన్' సినిమా రీమేక్ లో కంగన రనౌత్ పాత్రను పోషిస్తారని మనం చెప్పుకున్నాం. అయితే ఆ పాత్రను అసలు ఈ నలుగురు హీరోయిన్లూ చేయగలరా అనేదే ఇప్పుడు జనాల క్వశ్చన్. కాజల్ కొద్దోగొప్పో సైడ్ క్యారక్టర్ల సపోర్టు ఉంటే పర్లేదు కాని.. స్వతాహాగా సినిమా అంతా తన భుజాలపై వేసుకుని నడిపించాలంటే కష్టమే అనేది వారి కామెంట్. ఇక తమన్నా విషయానికొస్తే.. ఆమె చాలా డ్రమాటిక్ గా నాటకాలు వేసినట్లు పెర్ఫామ్ చేస్తుంది. మరి సున్నితమైన కంగన వంటి హావభావాలను పలికించగలదా? పారుల్ యాదవ్ కు ఇప్పటివరకు నటనను ప్రూవ్ చేసుకున్న దాఖలాలే లేవు. ప్చ్. మంజిమా మోహన్ యాక్టింగ్ పరంగా పర్లేదు కాని.. నూతన వధువుగా ఇంప్రెస్ చేయగలదా అనేదే చాలామంది డౌట్.

సర్లేండి.. జనాల కామెంట్లు ఏముందిలే.. మనోళ్ళు డీల్ సెట్ చేసుకుని సినిమాను చేసుకుంటూ వెళిపోదాం అనుకుంటున్నారు అంతే. కాకపోతే ఇప్పుడు క్వీన్ సినిమా అనగానే.. ఆల్రెడీ ఆ సినిమాను తెలుగు అండ్ తమిళ జనాలు హిందీ వర్షెన్ లో చాలాసార్లు చూసేశారు.. అందువలన అలా చూసుకున్నా కూడా ఈసినిమాపై పెద్దగా ఉత్సాహం జనాల్లో కనిపించట్లేదు.