Begin typing your search above and press return to search.

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మాజీ సీఎం భార్య

By:  Tupaki Desk   |   27 May 2022 1:30 PM GMT
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మాజీ సీఎం భార్య
X
మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య, బ్యాంకర్ అమృత ఫడ్నవీస్.. ఫ్రాన్స్ లో జరుగుతున్న కేన్స్ 75వ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోనే భాగంగా ఆమె రెడ్ కార్పైట్ పై నడిచారు. ఆమె నడిచిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ గా మారాయి.

ఈ సందర్భంగా అమృత ఫడ్నవీస్ ఆ స్టోరీలను పోస్ట్ చేస్తూ 'ఆహారం, ఆరోగ్యం మరియు స్థిరత్వం గురించి అవగాహన పెంచడానికి రెడ్ కార్పేట్ పై నడిచాను' అని రాస్తూ పోస్ట్ చేశారు. అమృతతోపాటు ఐవరీ కోస్ట్ ప్రథమ మహిళ డొమినిక్ ఔట్టారా, లెబనీస్ జోర్డానియన్ యువరాణి గిడా తలాల్, నటుడు స్టోన్ తదితరులు ఉన్నారు.

అమృత ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇటీవల ఉక్రెయిన్ లో మహిళలు, యువతులపై రష్యా సైనికుల అఘాయిత్యాలను ఆపండి అంటూ ఉక్రెయిన్ కు చెందిన నటి అర్థనగ్నంగా నిరసన తెలిపింది. తన దుస్తులను విప్పి అర్థనగ్నం నినాదాలు చేసింది. ఆమె శరీరంపై ఉక్రెయిన్ జెండా రంగులను వేసుకొని.. మాపై జరిగే అత్యాచారాలను ఆపండి అంటూ నినాదాలు చేసింది.

మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను 2005లో సామాజిక కార్యకర్తగా ఉన్న అమృత పెళ్లి చేసుకుంది. ఈమె మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఒక సాధారణ మహిళ. నాగ్ పూర్ లోని జీఎస్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ చేశారు.

తరువాత, ఆమె ఎంబీఏ ఫైనాన్స్ చేశారు.ఫూణేలోని సింబయాసిస్ లా స్కూల్ లో టాక్సేషన్ లా చదివారు. స్కూల్ స్టేజ్ లో ఉండగా రాష్ట్రస్థాయి అండర్ 16 టెన్నిస్ క్రీడాకారిణిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

అమృత ఫడ్నవీస్ విభిన్న రంగాలలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె క్లాసికల్ సింగర్, సామాజిక కార్యకర్త, ప్రొఫెషనల్ బ్యాంకర్, మహారాష్ట్ర చరిత్రలోనే అతిపిన్న వయస్కురాలైన ప్రథమ మహిళగా నిలిచారు. ఈ స్వతంత్ర మహిళాసాధకురాలు నేడు యాక్సిస్ బ్యాంక్ లో వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు.