Begin typing your search above and press return to search.

సినిమాల్లోకి ఇంకో పోర్న్ స్టార్

By:  Tupaki Desk   |   1 Nov 2017 4:35 AM GMT
సినిమాల్లోకి ఇంకో పోర్న్ స్టార్
X
పోర్న్ స్టార్ గా కెరీర్ ప్రారంభించిన సన్నీ లియోన్ బాలీవుడ్ లో అడుగుపెట్టాక ఎక్కడ లేని క్రేజ్ సంపాదించుకుంది. ఈరోజు ఆమె ఐటం సాంగ్ చేస్తే అది ఆ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. అందుకే షారూక్ ఖాన్ లాంటి టాప్ రేంజి హీరో సినిమా రయీస్ లో కూడా సన్నీలియోన్ ఐటం సాంగు మోత మోగిపోయింది. ఇప్పుడు బాలీవుడ్ లో బిజీబిజీగా ఉన్న లేడీ యాక్టర్లలో సన్నిలియోన్ పేరే ముందుంటుంది.

సన్నీలియోన్ బాటలోనే ఇప్పుడు మరో పోర్న్ స్టార్ ఇండియన్ సినిమాల్లో పాపులారిటీ పెంచుకోవాలని ఆశపడుతోంది. ఆమెపేరు మియా ఖలీఫా. ఒకప్పుడు పోర్న్ సినిమాలతో అందరికీ కైపెక్కించిన ఈ అందాల సుందరి కొన్నాళ్లగా ఆ సినిమాలకు దూరంగానే ఉంటోంది. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో నటించాలని అనుకుంటోంది. అయితే సన్నీలియోన్ నార్త్ లో అడుగు పెడితే మియా ఖలీఫా సౌత్ నుంచి అడుగు ముందుకేస్తోంది. మళయాళంలో తెరకెక్కుతున్న ఛుంకజ్2: ది కన్ క్లూజన్ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా షూటింగ్ స్టార్టవుతుంది.

కొత్త అందాలకు స్వాగతం పలికేందుకు ఫిలిం ఇండస్ట్రీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. అయితే సన్నీలియోన్ కవ్వించే అందాలతో పాటు మెప్పించేలా స్టెప్పులేయడంతో ఇక్కడి ప్రేక్షకులను త్వరగా ఆకట్టుకోగలిగింది. మియా ఖలీఫ్ లో కూడా గ్లామర్ కంటెంట్ పుష్కలంగా ఉంది. కాస్తంత డ్యాన్సులతో మెప్పించగలిగితే అవకాశాలు వెతుక్కుంటూ రావడం ఖాయమే.