Begin typing your search above and press return to search.
`పుష్ప` వికశించేది ఏ అడవిలో.. ఏదీ తేల్చరేమీ?
By: Tupaki Desk | 6 Oct 2020 12:40 PM ISTమొదట బ్యాంకాక్ థాయ్ ల్యాండ్ వెళ్లాలన్నారు. అంతలోనే ఉన్నట్టుడి మాయదారి మహమ్మారీ వూహాన్ నుంచి ఊడిపడింది. అన్నిటినీ తల్లకిందులు చేసింది. సరే.. థాయ్ లాండ్ వెళ్లలేకపోతే శేషాచలం (తిరుమల) అడవుల్లో షూటింగ్ చేసేద్దామనుకున్నారు. అక్కడ దేవుడి నుంచి అనుమతులు లభించలేదు. అయితేనేం.. ఆల్టర్నేట్ విషయంలో లెక్కల మాస్టార్ మైండ్ గేమ్ వేరే. కేరళ అడవులు.. ఆంధ్రా అడవుల్ని జల్లెడ పట్టారు.
ఇంతకీ పుష్ప కోసం ఏ అడవులకు వెళతారు? అన్నది మాత్రం ఇంకా అధికారికంగా ఫైనల్ చేసినట్టు కనిపించడం లేదు. ఆంధ్రాలోని మారేడుమిల్లి అడవులు అని ప్రచారం సాగుతున్నా దానికి సుకుమార్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కనీసం బన్ని అయినా సోషల్ మీడియా పోస్టింగులో వెల్లడించడం లేదు ఏ విషయమూ..
గత సంవత్సరం కేరళ అడవులలో ఒక కీలకమైన షెడ్యూల్ ను పూర్తి చేశారు. లాక్ డౌన్ లో పెరుగుతున్న COVID-19 కేసుల కారణంగా షూటింగ్ నిలిపేశారు. నిన్నమొన్నటి వరకు ఈ చిత్రం షూట్ డిసెంబర్ నుండి తిరిగి ప్రారంభమవుతుందని వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం... నవంబర్ నుండి పుష్ప షూట్ తిరిగి ప్రారంభించవచ్చు. కేరళ అడవుల్లో లేదా ఆంధ్రప్రదేశ్ లోని మారేడుమిల్లి అటవీ రిజర్వ్ లో చిత్రీకరణకు మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. రాబోయే షెడ్యూల్ హై-వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ తో ప్రారంభమవుతుంది. ఇది అల్లు అర్జున్ ఇతర విలన్లపై చిత్రీకరించనున్నారు. రష్మిక మందన్న ఇందులో కథానాయిక. సునీల్ శెట్టి నటిస్తారని ప్రచారమవుతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ఈ క్రేజీ ప్రాజెక్టును అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. దేవీశ్రీ సంగీత సంగీతం అందిస్తున్నారు.