Begin typing your search above and press return to search.

ఇండ‌స్ట్రీలో క‌ల‌క‌లం... సూప‌ర్‌ స్టార్‌ పై కేసు!

By:  Tupaki Desk   |   21 Sep 2019 8:15 AM GMT
ఇండ‌స్ట్రీలో క‌ల‌క‌లం... సూప‌ర్‌ స్టార్‌ పై కేసు!
X
మ‌ల్లూవుడ్ సూప‌ర్ స్టార్ మోహ‌న్‌ లాల్ భారీ చిక్కుల్లో ఇరుక్కున్నారు. కేర‌ళ అట‌వీ శాఖ అధికారులు శుక్ర‌వారం ఆయ‌న‌పై కేసు న‌మోదు చేశారు. చార్జ్‌ షీట్ కూడా దాఖ‌లు చేశారు. ఆయ‌న‌పై కేర‌ళ‌లోని ఎర్నాకుళం స‌మీపంలోని పెరుంబవూర్ కోర్టు అభియోగాలు మోపింది. ఏనుగు దంతపు కళాఖండాలను అక్రమంగా స్వాధీనం చేసుకున్నందుకు మోహ‌న్‌ లాల్‌ పై క్రిమిన‌ల్ కేసుకు సంబంధించి ఈ చార్జిషీట్ ఉంది. ప్ర‌స్తుతం ఈ విష‌యం మ‌ల్లూవుడ్‌ లో సంచ‌ల‌నంగా మారింది.

2012కు చెందిన ఈ కేసులో పోలీసులు మోహ‌న్‌ లాల్‌ నివాసం నుంచి అనేక దంతపు కళాఖండాలను స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు అనుమతి లేకుండా ఏ వ్యక్తి అయినా ప్రభుత్వ ఆస్తిని కలిగి ఉండటాన్ని వన్య‌ప్రాణుల ర‌క్ష‌ణ చ‌ట్టం నిషేధిస్తుంది. ఈ రక్షణ చట్టంలోని సెక్షన్ 39 (3) కింద మోహన్‌ లాల్‌ పై కేసు నమోదు చేసినట్లు శుక్రవారం చార్జిషీట్ సూచిస్తోంది.

ప్ర‌భుత్వ సంప‌ద‌ను ఎలాంటి అనుమ‌తులు లేకుండా ఇంట్లో పెట్టుకున్నార‌నే నేరంపై దాఖ‌లైన ఈ చార్జ్‌ షీట్‌ పై విచార‌ణ జ‌రిగితే.. మోహ‌న్‌ లాల్ చిక్కుల్లో ప‌డ్డ‌ట్టేన‌ని అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఇక మోహ‌న్‌ లాల్ తాజాగా ప్ర‌ధాన‌మంత్రి రోల్‌ లో న‌టించిన సూర్య కాప్స‌న్ (తెలుగులో బందోబ‌స్త్ ) సినిమా ఈ శుక్ర‌వారం తెలుగు - త‌మిళ్ భాష‌ల్లో రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే.