Begin typing your search above and press return to search.

విదేశీ మీడియాలో ప్రభాస్ గురించి..!

By:  Tupaki Desk   |   22 July 2021 8:31 AM GMT
విదేశీ మీడియాలో ప్రభాస్ గురించి..!
X
బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు పాన్‌ ఇండియా సినిమాలు అనడం కంటే అంతకు మించి అన్నట్లుగా ఉన్నాయి. కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఈ సినిమాలను విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు. కనుక ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌ నుండి గ్లోబల్‌ స్టార్‌ గా మారబోతున్నాడు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఆ సినిమాలు షూటింగ్‌ ముగించి విడుదల చేయకుండానే ప్రభాస్ ను గ్లోబల్‌ స్టార్‌ అంటున్నారు. అందుకు కారణం ఒక విదేశీ మీడియా సంస్థ ప్రభాస్ గురించి వార్త రాయడమే.

విదేశీ మీడియా సంస్థలు మన స్టార్స్ గురించి వార్తలు రావడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. హాలీవుడ్‌ సినిమా హీరోల ను మాత్రమే తమ మీడియాలో కవర్‌ చేసే ఇటలీ మీడియా సంస్థ ఇటీవల ప్రభాస్‌ గురించి వార్త కథనంను రాసింది. దాంతో ప్రస్తుతం ఆ వార్తను ప్రభాస్ అభిమానులు తెగ షేర్‌ చేస్తున్నారు. నెట్టింట ప్రభాస్ అభిమానులు తమ స్టార్‌ ను గ్లోబల్ స్టార్‌ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తమ హీరో తో పోటీ మరెవ్వరు లేరు అంటూ ప్రభాస్‌ అభిమానులు ఉబ్బి తబ్బిబ్బు అవుతున్నారు. ప్రభాస్‌ రాధే శ్యామ్‌ సినిమా షూటింగ్ ను ముగించుకుని ఇటలీ నుండి ఇండియాకు తిరిగి వెళ్లి పోయాడు అంటూ ఇటాలియన్‌ వెబ్‌ పోర్టల్‌ కథనం ను రాసింది.

ఆ కథనం ను ప్రభాస్ అభిమానులు షేర్‌ చేస్తూ తమ హీరో గ్లోబల్ స్టార్ అంటూ మురిసి పోతున్నారు. నిజంగానే ప్రభాస్ గ్లోబల్ స్టార్ అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఇతర దేశాల్లో కూడా ప్రభాస్ కు అభిమానులు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో ప్రభాస్‌ మరింతగా స్టార్‌ డమ్‌ దక్కించుకోవడం ఖాయం అంటూ వారు నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. రాధే శ్యామ్‌ సినిమా విడుదలకు సిద్దం అవుతుండగా.. సలార్‌ మరియు ఆదిపురుష్‌ లు సెట్స్ పై ఉన్నాయి. ఇక మరో సినిమా ను నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో చేయబోతున్నాడు. బాలీవుడ్‌ లో స్టార్‌ కమర్షియల్‌ డైరెక్టర్‌ తో కలిసి చేయబోతున్నాడు. ఇలా ప్రభాస్‌ చాలా బిజీగా ఉన్నాడు.