Begin typing your search above and press return to search.

బాలీవుడ్‌ నుండి ఒకే ఒక్కడు

By:  Tupaki Desk   |   5 Jun 2020 8:30 AM GMT
బాలీవుడ్‌ నుండి ఒకే ఒక్కడు
X
ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా సంపాదిస్తున్న సెలబ్రెటీల జాబితాను ఫోర్బ్స్‌ 2020 కి గాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఇండియన్‌ సెలబ్రెటీ అక్షయ్‌ కుమార్‌ నిలిచాడు. ఈయన ఈ ఏడాదికి గాను 48.5 మిలియన్‌ డాలర్లను సంపాదించినట్లుగా ఫోర్బ్స్‌ పేర్కొంది. 52 ఏళ్ల అక్షయ్‌ కుమార్‌ ఈ జాబితాలో 52వ స్థానంలో నిలవడం కాకతాళీయం. ఈమద్య కాలంలో అక్షయ్‌ కుమార్‌ ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

అక్షయ్‌ కుమార్‌ చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్‌ వద్ద కనీసం 100 కోట్లను మించి వసూళ్లు సాధిస్తూనే వచ్చాయి. కనుక ఈయన పారితోషికం భారీగా పెరిగింది. ఇక దాదాపుగా 20 బ్రాండ్స్‌ కు ఈయన అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. దాంతో కూడా ఈయన ఆదాయం భారీగా పెరింగింది. వెబ్‌ సిరీస్‌ లు సినిమాలు బ్రాండ్‌ అంబాసిడర్‌ గా చేయడం ఇలా బిజీ బిజీగా గడుపుతున్న కారణంగా ప్రపంచ అత్యధిక ఆదాయం పొందిన సెలబ్రెటీల జాబితాలో అక్షయ్‌ కుమార్‌ నిలిచాడు.

ఈ జాబితాలో ప్రియాంక చోప్రా భక్త నిక్‌ జాన్స్‌ సోదరులు కూడా ఉన్నారు. వారు జాన్స్‌ బ్రదర్స్‌కు ఈ జాబితాలో 20వ స్థానం దక్కింది. అమెరికన్‌ సింగర్స్‌ అయిన జాన్స్‌ బ్రదర్స్‌ స్టేజ్‌ షోలకు మంచి డిమాండ్‌ ఉంది. అందుకే వారి ఆదాయం విపరీతంగా పెరిగి 20వ స్థానంలో నిలిచారు.