Begin typing your search above and press return to search.

‘ఒక్క క్షణం’లో ఆ ట్రీట్ అలా మిస్సయింది

By:  Tupaki Desk   |   31 Dec 2017 5:27 AM GMT
‘ఒక్క క్షణం’లో ఆ ట్రీట్ అలా మిస్సయింది
X
ఈ గురువారం విడుదలైన ‘ఒక్క క్షణం’ సినిమా కోసం కొన్ని రోజుల కిందటే ఒక స్పెషల్ సాంగ్ షూట్ చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ఆ పాట తాలూకు ఫొటోలు హల్ చల్ చేశాయి. హీరోయిన్ సురభి చాలా హాట్ హాట్ గా కనిపించి కుర్రాళ్ల దృష్టిని ఆకర్షించింది. కానీ తీరా సినిమా చూస్తే ఈ పాట కనిపించలేదు. సినిమా అయిపోయాక రోలింగ్ టైటిల్స్ పడేటపుడు ఈ పాటను ప్లే చేశారు. కానీ అప్పటికే చాలామంది జనాలు థియేటర్ నుంచి వచ్చేస్తుంటారు. సినిమా విడుదలకు పది రోజుల ముందే చిత్రీకరించిన ఈ పాటను సినిమాలో ఎందుకు పెట్టలేదన్నది జనాలకు అర్థం కాలేదు.

ఐతే విడుదలకు ముందు ఫస్ట్ కాపీ ఫైనలైజ్ చేసే ముందు చూసుకుంటే నిడివి ఎక్కువైపోయిందని.. దీంతో కచ్చితంగా సినిమాలో పెట్టాలనుకుని చిత్రీకరించిన ఈ ఫోక్ సాంగ్ ను పక్కన పెట్టక తప్పలేదని శిరీష్ చెప్పాడు. దీంతో పాటు సినిమాలో కొన్ని కామెడీ సీన్లు కూడా ఎడిట్ చేయాల్సి వచ్చిందని శిరీష్ తెలిపాడు. కొందరు సినిమాలో కామెడీ లేకపోవడంపై పెదవి విరుస్తున్నారని.. కానీ ఇంకొందరు మాత్రం సీరియస్ గా సాగే సినిమాలో మధ్యలో అక్కడక్కడా ఎందుకు కామెడీ సీన్లు పెట్టారని విమర్శిస్తున్నారని.. దీంతో ఏ విషయాన్ని అనుసరించాలో తెలియని గందరగోళం నెలకొందని శిరీష్ చెప్పాడు. ఏదేమైనా తమ సినిమాకు మంచి ఆదరణ దక్కుతుండటం సంతోషంగా ఉందని అతను చెప్పాడు.