Begin typing your search above and press return to search.

ఫోకస్‌ అంతా బోయపాటి మీదనే

By:  Tupaki Desk   |   11 April 2015 11:00 PM IST
ఫోకస్‌ అంతా బోయపాటి మీదనే
X
మనం చాలా రోజుల క్రితం ఓ విషయం చెప్పాం గుర్తుందా? సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి సినిమా హిట్టయితే బోయపాటి మీద మరింత బరువు పెరుగుతుందని, ఒకవేళ ఫ్లాపైతే ఇంకా ఎక్కువ బరువు పడుతుందని చెప్పుకున్నాం. ఇప్పుడు అదే విషయం గురించి మాట్లాడుకునే సమయం వచ్చేసింది. పూర్‌ టాక్‌తో అభిమానులను అప్సెట్‌ చేసిన సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి సీన్‌ ఏంటో ఇక వేరే చెప్పక్కర్లేదు.

ఇప్పుడిక బన్నీకి రేసుగుర్రం తరువాత మరి బ్లాక్‌బస్టర్‌ కల నెరవేరలేదు. సో, ఆ బాధ్యత ఇప్పుడు బోయపాటి శ్రీను మీదనే పడుతోంది. ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్లు ఎవ్వరూ బోయపాటికి దమ్ము ఫ్లాప్‌ తరువాత ఒక్క ఛాన్స్‌ కూడా ఇవ్వలేదు. కాని బన్నీ మాత్రం ఒక సరైన కథ వినిపించడంతో వెంటనే ఛాన్సిచ్చాడు. మధ్యలో బెల్లంకొండ శ్రీనివాస్‌ సినిమా ఆగిపోయినప్పటికీ బోయపాటి డైరక్షన్‌లో చేయడానిక బన్నీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం జరిగింది. అందుకే ఇప్పుడు ఈ అవకాశాన్ని బోయపాటి సద్వినియోగం చేసుకుంటాడని అందరూ అనుకుంటున్నారు.

ప్రస్తుతం బన్నీ, బోయపాటి గీతా ఆర్ట్స్‌ ఆఫీసులో కూర్చొని మాటల రచయిత ఎం.రత్నంతో కలసి తన లవ్‌ యాక్షన్‌ సినిమాను పదును పట్టే పనిలో పడ్డాడట బన్నీ. మరి బోయాపటి బన్నీకి కావల్సిన ఆ సూపర్‌ హిట్‌ను అందిస్తాడా? ఈ సినిమా కూడా ఈ ఏడాదే రిలీజ్‌. వెయిట్‌ అండ్‌ సి.