Begin typing your search above and press return to search.

మరో ఇండియన్ సూపర్ హీరో వచ్చేశాడు

By:  Tupaki Desk   |   27 Oct 2015 7:32 AM GMT
మరో ఇండియన్ సూపర్ హీరో వచ్చేశాడు
X
గాల్లోకి ఎగిరి అద్భుత విన్యాసాలు చేసే సూపర్ హీరోకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్నారు. ఐతే ఎప్పుడూ హాలీవుడ్ సూపర్ హీరోలనే ఏం చూస్తామని.. మన బాలీవుడ్లోనూ ఓ సూపర్ హీరోను రెడీ చేశాడు రాకేష్ రోషన్. తన కొడుకు హృతిక్ రోషన్ హీరోగా క్రిష్ సిరీస్ లో మూడు సూపర్ హీరో సినిమాలు తీసి ప్రేక్షకుల్ని మెప్పించాడు. వందల కోట్ల వసూళ్లు రాబట్టాడు.

ఐతే ఇప్పుడు భారతీయ తెరమీదికి ఇంకో సూపర్ హీరో వస్తున్నాడు. అతనే టైగర్ ష్రాఫ్.. జాకీ ష్రాఫ్ తనయుడు. ‘హీరో పంటి’ సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన టైగర్ ఇప్పుడు ‘ఫ్లైయింగ్ జాట్’గా రాబోతున్నాడు. ఇందులో అతను సూపర్ హీరో పాత్ర పోషిస్తున్నాడు. బాలాజీ మోషన్ పిక్చర్స్ బేనర్ మీద ఏక్తా కపూర్, శోభా కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

కొరియోగ్రఫీ నుంచి డైరెక్షన్లోకి వచ్చి ఏబీసీడీ - ఏబీసీడీ-2 సినిమాలు తీసిన రెమో డిసౌజా ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా కోసం హాలీవుడ్లో బ్యాట్ మాన్, సూపర్ మాన్ సినిమాలకు పని చేసిన స్టంట్ డైరెక్టర్లను తీసుకొస్తున్నారు. వచ్చే వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది.