Begin typing your search above and press return to search.

వర్మ దెయ్యం సినిమాలో లక్స్ పాప

By:  Tupaki Desk   |   26 April 2017 8:08 AM GMT
వర్మ దెయ్యం సినిమాలో లక్స్ పాప
X
రాంగోపాల్ వర్మకు జనాలను భయపెట్టడం అంటే భలే ఇష్టం. అందుకే తను ఎన్ని సార్లు ఫెయిల్ అయినా.. జనాలను భయపెట్టే వరకూ సినిమాలు తీస్తూనే ఉంటానని అంటాడు. అటు వివాదాస్పద అంశాలను ఎంత పక్కాగా తెరకెక్కిస్తాడో.. హారర్ మూవీస్ ని కూడా అంతే శ్రద్ధగా రూపొందించే వర్మ.. ఇప్పుడు గెహెర్ అనే దెయ్యాల సినిమా తీస్తున్నాడు.

మిథున్ చక్రవర్తి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో.. టాలీవుడ్ లక్స్ పాప ఆశా షైనీ అలియాస్ ఫ్లోరా షైనీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. 'నాకు చిన్నప్పటి నుంచి దెయ్యాలంటే మహా భయ్యం. అయితే.. దక్షిణాదిలో ఓ సినిమాలో దెయ్యం పట్టిన పాత్ర చేయాల్సి వచ్చింది. అదృష్టవశాత్తూ ఈ సినిమాలో అలాంటి పాత్ర కాదు. కానీ మిథున్ చక్రవర్తిని ఆ పాత్రలో చూసి స్తంభించిపోయాను. ఆయన పెర్ఫామెన్స్ చూసేందుకు అక్కడక్కడే తిరుగుతున్నాను' అని చెప్పింది ఫ్లోరా షైనీ. ఈ సినిమాలో మకరంద్ దేశ్ పాండే నటన ఎంతో ఆకట్టుకుంటుందని.. కొత్త గెటప్ లో కనిపిస్తాడని చెబుతోందీమె.

'మకరంద్ ను మొదటిసారి సెట్స్ పై చూసినపుడు అసలు గుర్తుపట్టలేదు. అంతగా ఆయన గెటప్ లో వేరియేషన్ ఉంటుంది' అని చెప్పిన ఫ్లోరా.. ఈ మూవీతో తన పాత్ర రియల్ లైఫ్ కు దగ్గరగా ఉంటుందని అంటోంది. వర్మ తనకు కావాల్సిన విషయాల్లో చాలా నిక్కచ్చిగా ఉంటాడని.. ఆయన దగ్గర ఏదైనా కొట్టేసే అవకాశం వస్తే.. తప్పనిసరిగా మైండ్ ను దొంగిలిస్తానని ఫ్లోరా షైనీ చెబుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/