Begin typing your search above and press return to search.

ఇక్కడ ఫట్టు - ప్రైములో హిట్టు

By:  Tupaki Desk   |   2 May 2019 1:30 AM GMT
ఇక్కడ ఫట్టు - ప్రైములో హిట్టు
X
డిజిటల్ విప్లవం వచ్చాక సినిమాల స్వరూపమే కాదు ఫలితాల లెక్కలు కూడా అదే రీతిలో మారిపోతున్నాయి. ఏదైనా సినిమా ధియేటర్లో ఆడక ఎక్కువ వసూళ్లు తెచ్చుకోలేక ఫ్లాప్ ముద్ర వేయించుకుందనుకుంటే తీరా ఆన్ లైన్ లో వచ్చేటప్పటికి అది సృష్టిస్తున్న రికార్డులు చూస్తే జనం ఏదో రూపంలో కాస్త ఆలస్యంగా అయినా చూస్తారనే నమ్మకం కలుగుతోంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణలు కళ్ళ ముందే కనిపిస్తున్నాయి.

హళ్ళలో జనానికి భారంగా అనిపించిన పడి పడి లేచే మనసు వీడియో స్ట్రీమింగ్ లో మాత్రం సూపర్ హిట్ అనిపించుకోవడం విశేషం. బాగానే ఉందే అప్పుడు ఎందుకు ఆడలేదో అనే కామెంట్స్ వచ్చి పడ్డాయి. బాలయ్య కెరీర్లోనే డిజాస్టర్ గా మచ్చ పడ్డ ఎన్టీఆర్ కథానాయకుడు నెలకే అందుబాటులోకి రావడంతో అప్పుడు చూసిన ప్రేక్షకులు బయట చెప్పినంత నాసిరకంగా సినిమా లేదే అన్న అభిప్రాయం వ్యక్తం చేసినవాళ్ళే ఎక్కువ

గత డిసెంబర్ లో వచ్చిన సత్యదేవ్ బ్లఫ్ బస్టర్ అసలు వచ్చిన సంగతి గుర్తించే లోపే మాయమైపోయింది. జస్ట్ నాలుగు రోజుల క్రితం యుట్యూబ్ లో ఆదిత్య ఛానల్ ఆఫీషియల్ గా పోస్ట్ చేస్తే తక్కువ టైంలోనే మిలియన్ వ్యూస్ తెచ్చుకుని నెంబర్ వన్ ట్రెండింగ్ ని కొన్ని గంటల పాటు అలాగే స్థిరంగా మైంటైన్ చేసింది. ఇప్పుడు టాప్ 10 లోపే ఉండటం విశేషం.

వరుణ్ తేజ్ అంతరిక్షంది సైతం ఇదే పరిస్థితి. యాత్ర సినిమా హాల్స్ లో మెప్పు పొందినా ఆన్ లైన్ లోకి వచ్చాక ఇది మిస్ అయ్యామా అనుకున్న శాతమే ఎక్కువ. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దదే ఉంది కాని ఫ్లాప్ అనిపించుకున్నా అది జనంకి చేరడంలో డిజిటల్ సంస్థలు పోషిస్తున్న పాత్ర అటు దర్శక నిర్మాతలకు పేరు పరంగా ఆర్థికపరంగా బాగా దోహదపడుతున్నాయన్నది నిజం