Begin typing your search above and press return to search.
ఫ్లాప్ హీరోలు.. బ్రేక్ తీసుకున్నారు
By: Tupaki Desk | 30 July 2018 8:00 PM ISTఒకప్పుడు అడపా దడపా హిట్లు కొడుతూ.. రెండు మూడు సినిమాలు చేతిలో ఉంచుకుని మంచి ఊపుమీద కనిపించిన కొందరు యువ హీరోలు ఈ మధ్య వరుస ఫ్లాపులతో సతమతం అయ్యారు. రకరకాల పాత్రలు.. కథలు ట్రై చేసి చూసినా ఫలితం లేకపోయింది. ఒకదాన్ని మించి ఇంకో సినిమా ఫ్లాప్ అవుతుండటంతో అయోమయంలో పడిపోయారు. ఇప్పుడిక ఇంకో ఫ్లాప్ కొడితే పూర్తిగా కెరీర్ మటాష్ అయిపోయే పరిస్థితుల్లో బ్రేక్ తీసుకుంటున్నారు. కమ్ బ్యాక్ మూవీ విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నారు. ఆ యంగ్ హీరోలు.. సాయిధరమ్ తేజ్.. మంచు మనోజ్.. రాజ్ తరుణ్.
వీళ్లందరూ ఒకప్పుడు మంచి హిట్లతో జోరు మీద కనిపించిన వాళ్లే. తేజు ‘రేయ్’ సినిమా తేడా కొట్టినప్పటికీ ‘పిల్లా నువ్వు లేని జీవితం’.. ‘సుప్రీమ్’.. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాలతో సత్తా చాటుకున్నాడు. కానీ తర్వాత వరుసగా అరడజను ఫ్లాపులు ఎదురయ్యాయి. ఇక మనోజ్ ‘కరెంటు తీగ’.. ‘పోటుగాడు’ సినిమాలతో మంచి ఊపు మీద కనిపించాడు. కానీ తర్వాత అతడి సినిమాలన్నీ తుస్సుమన్నాయి. రాజ్ తరుణ్ కెరీర్ ఆరంభంలో ‘ఉయ్యాల జంపాల’.. ‘సినిమా చూపిస్త మావ’.. ‘కుమారి 21 ఎఫ్’ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టాడు. కానీ తర్వాత అతడి నుంచి ఓ మోస్తరు సినిమా కూడా ఏదీ రాలేదు. ఈ ఏడాది ఇప్పటికే అతను మూడు డిజాస్టర్లు తిన్నాడు ఈ ముగ్గురు హీరోలకూ ఇప్పుడు దిక్కు తోచట్లేదు. రకరకాల ప్రయత్నాుల చేసి ఫెయిలైన ఈ యువ కథానాయకులు.. తర్వాత ఎలాంటి సినిమా చేయాలో తెలియని అయోమయంలో బ్రేక్ తీసుకున్నారు. కొన్ని రోజుల పాటు ప్రశాంతంగా గడిపి.. ఆ తర్వాత మంచి కాన్సెప్ట్ చూసుకుని నెమ్మదిగా సినిమా చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మరి ఈ విరామం అయినా వారికి మంచి జడ్జిమెంట్ స్కిల్ ఇస్తుందేమో చూడాలి.