Begin typing your search above and press return to search.

వ‌రుసగా OTTలో ఫ్లాప్ ల ఫెస్టివ‌ల్..!

By:  Tupaki Desk   |   10 Feb 2022 4:45 AM GMT
వ‌రుసగా OTTలో ఫ్లాప్ ల ఫెస్టివ‌ల్..!
X
ఒక్కోసారి థియేటర్ల‌లో సినిమాలు ఆడ‌కపోయినా ఓటీటీల్లో టీవీల్లో వీక్ష‌ణ అధికంగా ఉంది. టీఆర్పీల పంట పండుతోంది. కొన్ని కొత్త సినిమాలు ఇటీవ‌ల థియేట‌ర్ల‌లో విడుద‌లైన‌వి ఇప్పుడు వ‌రుస‌గా వారం వారం ఓటీటీల్లో ట్రీటిచ్చేందుకు రెడీ అవుతున్నాయి.

వీటిలో మ‌ల్టీస్టార‌ర్ బంగార్రాజు పై ఫోక‌స్ స‌హ‌జంగానే ఎక్కువ అన‌డంలో సందేహం లేదు. గుడ్ లక్ సఖి- బంగార్రాజు- హీరో - రౌడీ బాయ్స్ మరో నాలుగు వారాల్లో OTTలో రానున్నాయి. వీటిలో బంగార్రాజు ఒక్క‌టే యావ‌రేజ్ కాగా.. బాక్సాఫీస్ వద్ద ఇత‌ర సినిమాలు ఫ్లాప్ లు గా నిలిచాయి. నాగార్జున- నాగ చైతన్య నటించిన బంగార్రాజు చిత్రం బాక్సాఫీస్ వద్ద ఓకే మూవీ. ఈ మూవీ థియేట్రికల్ విడుదలైన ఒక నెల తర్వాత ఫిబ్రవరి 18న జీ5లో విడుదలవుతోంది.

కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ ఇంత‌కుముందు ఓటీటీలో వచ్చి ఫ్లాపైంది. కానీ ఇప్పుడు `గుడ్ లక్ సఖి` థియేట‌ర్ల‌లో విడుద‌లై బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. బాక్సాఫీస్ కలెక్షన్ల పరంగా డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం ఇప్పుడు ఫిబ్రవరి 12న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌ల‌వుతోంది. థియేటర్లలో విడుదలై సరిగ్గా 15 రోజుల‌లో ఇది వ‌చ్చేస్తోంది. అయితే ఓటీటీలో ఆద‌ర‌ణ ఎంత అన్న‌ది చూడాలి.

డెబ్యూల సంగ‌తేంటో..!

ఈ సీజ‌న్ లో ఇద్ద‌రు డెబ్యూ హీరోలు బ‌రిలో దిగారు. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా న‌టుడిగా ప‌రిచ‌య‌మైన చిత్రం -హీరో. బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఇందులో అశోక్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ న‌టించింది. ఈ చిత్రం ఈ నెల 11న డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో వస్తోంది. అలాగే దిల్ రాజు కుమారుడు ఆశిష్ న‌టించిన `రౌడీ బాయ్స్` చిత్రం కాలేజ్ యూత్ ని ఆకర్షించింది. థియేట్రికల్ విడుదలకు ముందే మేకర్స్ ఈ చిత్రాన్ని దూకుడుగా ప్రమోట్ చేసారు కానీ అది ఆశించినంత‌గా బ‌య్య‌ర్ల‌కు లాభాలను అందించలేకపోయింది. ఆశిష్ రెడ్డి స‌ర‌స‌న‌ అనుపమ పరమేశ్వరన్ క‌థానాయిక‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ మార్చి 8న జీ5లో వస్తుంది. ఈ సీజ‌న్ లో బంగార్రాజు మినహా ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. అయితే జ‌నం థియేట‌ర్ల‌కు వెళ్ల‌క‌పోయినా తెలివిగా ఓటీటీల్లో సినిమాల వీక్ష‌ణ‌కు అల‌వాటు ప‌డ్డార‌ని ఇవ‌న్నీ ప్రూవ్ చేస్తాయేమో!

ఓటీటీల్లో లిప్ లాక్ కాంపిటీష‌న్!

ఈ సంక్రాంతి బ‌రిలో ఇరువురు డెబ్యూ హీరోలు అదృష్టం ప‌రీక్షించుకున్న సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు సోద‌రుని కుమారుడు ఆశిష్ - రౌడీ బోయ్స్ చిత్రంతో ల‌క్ చెక్ చేసుకోగా.. సూప‌ర్ స్టార్ మ‌హేష్ మేన‌ల్లుడు గ‌ల్లా అశోక్ - హీరో చిత్రంతో స‌త్తా చాటాల‌ని ప్ర‌య‌త్నించాడు. ఈ ఇద్ద‌రు హీరోలు త‌మ క‌థానాయిక‌ల‌తో వెండితెర‌పై లిప్ లాక్ ల‌తో మ్యాజిక్ చేయాల‌నుకున్నారు. ట్రైల‌ర్స్ లో ఇద్ద‌రు హీరోలు క‌థానాయిక‌ల‌తో లిప్ లాక్ లు వేస్తూ చెల‌రేగిపోగా అంచ‌నాలేర్ప‌డ్డాయి. అనుప‌మ‌తో డీప్ లిప్ లాక్ లాగించేస్తూ ఆశిష్ ఆశ్చ‌ర్య‌ప‌ర‌చ‌గా.. ఇటు త‌న హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ తో ఘాటైన చుంబ‌నంతో అశోక్ గ‌ల్లా కూడా అంతే చెల‌రేగిపోయాడు. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్ప‌టికే అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. మహేష్ బాబు మేనల్లుడు.. ఆయన అక్క కొడుకు అశోక్ గల్లా తెలుగు ఇండస్ట్రీలో హీరోగా అరంగేట్రం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్ నిధి అగర్వాల్ నిజానికి ఈ యువ హీరోతో లిప్ వేయడంతో `హీరో` ట్రైలర్ యూత్ దృష్టిని ఆకర్షించింది.

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ లాంటి సీనియ‌ర్ తో జూనియ‌ర్ ఆశిష్ రెడ్డి ఘాటైన లిప్ లాక్ లు వేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ట్రైలర్ లు కనీసం ఒక్క ముద్దు సన్నివేశాన్ని అయినా క‌లిగి ఉండ‌డంతో ఫెస్టివ‌ల్ మూడ్ క‌నిపించింది. ఎలాగైనా పాపులర్ హీరోయిన్ నుండి లిప్ కిస్ లు కొట్టేసిన అశోక్.. ఆశిష్ రెడ్డిని చూసి సీనియ‌ర్లు కూడా జెల‌సీ ఫీల‌య్యారు. కానీ ఈ లిప్ లాక్ లు యూత్ ని థియేట‌ర్ల‌కు ప‌దే ప‌దే రిపీట్ అయ్యేలా చేయ‌లేక‌పోయాయి. అందుకే బాక్సాఫీస్ ఫ‌లితం ఆశించినంత‌గా రాలేదు. ఇక ఓటీటీల్లో అయినా లిప్ లాక్ ఫెస్టివ‌ల్ తో ఆద‌ర‌ణ ద‌క్కుతుందేమో చూడాలి.