Begin typing your search above and press return to search.

రజినీ ఒక్కడు ఖాళీ చేస్తే ఐదుగురొచ్చారు

By:  Tupaki Desk   |   14 Dec 2017 2:30 AM GMT
రజినీ ఒక్కడు ఖాళీ చేస్తే ఐదుగురొచ్చారు
X
గత నెల రోజులుగా చిన్న సినిమాల మోత మోగుతోంది. నవంబర్లో ఒక్కో వారం ఏడెనిమిది సినిమాలు కూడా రిలీజయ్యాయి. ఈ వారాంతంలో కూడా 12 సినిమాలు వస్తాయని అంటున్నారు. ఐతే చిన్న సినిమాలు.. పెద్దగా పేరు లేనివి ఎన్ని రిలీజైనా ఇబ్బంది లేదు. వీటిలో చాలా వరకు నామమాత్రంగా.. ఏదో రిలీజయ్యాయంటే అయ్యాయి అనిపించేవే. ఐతే వచ్చే జనవరి 26న మాత్రం ఏకంగా ఐదు పేరున్న సినిమాలు ఒకే రోజు విడుదలకు సిద్ధమవుతుండటం విశేషం. క్రిస్మస్ వీకెండ్ లో రెండు.. ఈ నెల చివర్లో రెండు.. సంక్రాంతి సీజన్లో రెండు మూడు సినిమాలు సినిమాలు వరుసలో ఉన్నాయి. ఐతే ఆ వారాంతాల్ని మించిన పోటీ రిపబ్లిక్ డే వీకెండ్లో ఉండబోతోంది. ఇంకా నెలన్నర సమయం ఉండగానే ఆ తేదీకి ఐదు సినిమాలు రిలీజ్ డేట్ కన్ఫమ్ చేసుకోవడం విశేషం.

ముందుగా అనుష్క సినిమా ‘భాగమతి’ని జనవరి 26కు ఫిక్స్ చేశారు. ఆ తర్వాత మంచు విష్ణు సినిమా ‘ఆచారి అమెరికా’ అదే తేదీకి ఖరారైంది. తర్వాత కమల్ హాసన్ సినిమా ‘విశ్వరూపం-2’ అదే తేదీకి వస్తుందని ప్రకటించారు. ఇప్పుడు ఇంకో రెండు సినిమాలు రేసులోకి వచ్చాయి. ఒకటి సందీప్ కిషన్ హీరోగా మంజుల దర్శకురాలిగా పరిచయమవుతున్న ‘మనసుకు నచ్చింది’ కాగా.. ఇంకోటి విశాల్ సినిమా ‘అభిమన్యుడు’. సంక్రాంతికే రావాల్సిన ‘అభిమన్యుడు’ను కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. నిజానికి రిపబ్లిక్ డే వీకెండ్లో రజినీ సినిమా ‘2.0’ రావాల్సింది. ఆ సినిమా సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. దీంతో ఒకటికి ఐదు సినిమాలు ఈ వీకెండ్ మీద కన్నేశాయి. మరి ఈ ఐదు సినిమాలూ ఒకేసారి వస్తాయా.. లేక వీటిలో ఏవైనా రేసు నుంచి తప్పుకుంటాయా అన్నది చూడాలి.