Begin typing your search above and press return to search.
పవన్ బర్త్ డే వేడుకలకు వెళ్తూ ఐదుగురి మృతి
By: Tupaki Desk | 2 Sept 2020 1:00 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున మరో విషాదం చోటుచేసుకుంది. మరో ఐదుగురు అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే నిన్నచిత్తూరు జిల్లా కుప్పంలో ఫ్లెక్సీ కడుతూ ముగ్గురు అభిమానులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన తరువాత తాజాగా మరో ప్రమాదంలో ఐదుగురు పవన్ అభిమానులు దుర్మరణం చెందడం విషాదం నింపింది.
అభిమాన హీరో పవన్ కళ్యాణ్ పుట్టినరోజును సెలెబ్రెట్ చేసుకునేందుకు కారులో వరంగల్ జిల్లా పరకాలకు బయల్దేరిన ఐదుగురు స్నేహితులను లారీ రూపంలో మృత్యువు కబళించింది.
వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం పసరగొండ వద్ద బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. యువకులు ప్రయాణిస్తున్న కారును కాళేశ్వరం నుంచి వరంగల్ వస్తున్న ఇసుకలారీ ఢీకొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. నిద్రమత్తులో ఉన్న లారీ డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగింది.
కారు నుజ్జునుజ్జు కావడంతో ఐదుగురి మృతదేహాలను బయటకు తీయడానికి శ్రమించాల్సి వచ్చింది. మృతులు వరంగల్ పోచమ్మమైదాన్ వాసులుగా గుర్తించారు.