Begin typing your search above and press return to search.

బాబోయ్‌... ఇంత మంది చంద్రముఖిలు ఎందుకు భయ్యా?

By:  Tupaki Desk   |   28 July 2022 4:30 PM GMT
బాబోయ్‌... ఇంత మంది చంద్రముఖిలు ఎందుకు భయ్యా?
X
రజినీకాంత్‌ హీరోగా నటించి సూపర్ హిట్‌ అయిన చంద్రముఖి సినిమా కు సీక్వెల్‌ అన్నట్లుగా చంద్రముఖి 2 ను రాఘవ లారెన్స్ చేస్తున్న విషయం తెల్సిందే. పి వాసు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా లో లారెన్స్ కు జోడీగా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా అయిదుగురు హీరోయిన్స్ నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కథానుసారంగా ఈ సినిమా లో అయిదుగురు ముద్దుగుమ్మల ఆడి పాడబోతున్నారట.

చంద్రముఖి సినిమా లో జ్యోతిక చంద్రముఖి గా కనిపించగా నయనతార మరో హీరోయిన్ గా కనిపించిన విషయం తెల్సిందే. చంద్రముఖి 2 లో కూడా జ్యోతికను చంద్రముఖి పాత్రకు అడిగారు అనే వార్తలు వచ్చాయి. ఆమె ఎలాగూ సెకండ్‌ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టి వరుసగా సినిమాలు చేస్తుంది కనుక చంద్రముఖి 2 కి ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయని అంతా భావించారు.

తాజాగా అయిదుగురు హీరోయిన్స్‌ ఎంపిక అయ్యారని అధికారికంగా ప్రకటన వచ్చింది కాని... ఆ అయిదు మంది పేర్లలో జ్యోతిక పేరు లేదు.

మంజిమా మోహన్‌.. సుభిక్ష కృష్ణన్‌.. సృష్టి దాంగే.. మహిమ.. లక్ష్మి మీనన్‌ లు హీరోయిన్స్ గా తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇంత మంది చంద్రముఖి లు ఎందుకు అన్నట్లుగా నెటిజన్స్ లారెన్స్ ను ప్రశ్నిస్తున్నారు. సినిమా లో అత్యంత కీలక పాత్రలో సీనియర్ నటుడు కనిపించబోతున్నాడని అంటున్నారు.

ఆ సీనియర్ నటుడు ఎవరు అనే విషయంలో ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. తమిళ సినీ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్స్ లో చంద్రముఖి 2 గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. కేవలం తమిళంలోనే కాకుండా పాన్‌ ఇండియా స్థాయి లో ఈ సినిమా ను విడుదల చేయబోతున్నట్లుగా యూనిట్‌ సభ్యులు అధికారికంగా ఇప్పటికే ప్రకటించారు.

గతంలో లారెన్స్ కు హర్రర్‌ కామెడీ సినిమా లు చేసిన.. నటించిన అలవాటు ఉంది. కనుక చంద్రముఖి 2 సినిమా ఆయనకు ఖచ్చితంగా ఒక మంచి సూపర్‌ హిట్‌ గా నిలుస్తుందనే నమ్మకం ను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. చంద్రముఖి కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి. కాని లారెన్స్‌ చేస్తున్న ఈ సినిమా మాత్రం అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది.