Begin typing your search above and press return to search.

పృథ్వీ షాకు ఐదు అవార్డులు.. మోసుకెళ్లడానికి సూట్ కేస్ కావాలేమోనంటూ హీరోయిన్ ట్రోల్స్

By:  Tupaki Desk   |   1 May 2021 6:09 AM GMT
పృథ్వీ షాకు ఐదు అవార్డులు.. మోసుకెళ్లడానికి సూట్ కేస్ కావాలేమోనంటూ హీరోయిన్  ట్రోల్స్
X
ఐపీఎల్ 2021 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా దూసుకు పోతున్నాడు. వరుసగా అన్ని మ్యాచ్ లలో రాణిస్తూ జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సీజన్లో పృథ్వీ షా అదరగొడుతున్నాడు. గురువారం కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో పృథ్వీ షా రెచ్చిపోయాడు. కేవలం 41 బంతుల్లో 82 పరుగులు చేశాడు. మొదటి ఓవర్లోనే నైట్ రైడర్స్ బౌలర్ శివమ్ మావీ బౌలింగ్ ను చీల్చి చెండాడాడు. వరుసగా ఆరు బంతుల్లో 6 ఫోర్లు కొట్టి రికార్డు సృష్టించాడు.

అంతకుముందు ఐపీఎల్లో ఒకే ఓవర్లో ఆరు బంతులను బౌండరీలుగా మలిచిన బ్యాట్స్ మెన్ గా అజింక్య రహానే ఉన్నాడు. ఇప్పుడు పృథ్వీ షా ఆ రికార్డును సమం చేశాడు. పృథ్వీ షా విజృంభనతో నైట్ రైడర్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పృథ్వీషా ప్రదర్శనకు గానూ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ తోపాటు మరో నాలుగు అవార్డులు దక్కాయి.

మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ తోపాటు సఫారీ సూపర్ స్ట్రైకర్, గేమ్ చేంజర్, క్రెడ్ పవర్ ప్లేయర్, అప్ స్టాక్స్ మోస్ట్ వాల్యూబుల్ అసెట్ అవార్డులను అందుకున్నాడు. పృథ్వీ షా అద్భుత ప్రదర్శనపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. క్రికెట్ అభిమానులే కాదు.. బాలీవుడ్ హీరోయిన్ ప్రాచీ కూడా పృథ్వీ షాను పొగడ్తలతో ముంచెత్తింది.

పృథ్వీ షా, హీరోయిన్ ప్రాచీ సింగ్ మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లు కొద్ది రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పృథ్వీ షా ప్రదర్శనపై ప్రాచీ సింగ్ స్పందించడంతో వారిద్దరి మధ్య ఏదో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రాచీ పృథ్వీ షా గెలుచుకున్న అవార్డులు అన్నింటిని ఒక ఫోటో లో జత చేసింది. వీటన్నింటినీ తీసుకెళ్లడానికి ఒక కొత్త సూట్ కేస్ కావాలేమో అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ప్రాచీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.