Begin typing your search above and press return to search.

టాలీవుడ్ న‌యా ట్రెండ్ ఫిట్ నెస్ రీల్స్..!

By:  Tupaki Desk   |   8 July 2021 10:00 PM IST
టాలీవుడ్ న‌యా ట్రెండ్ ఫిట్ నెస్ రీల్స్..!
X
టాలీవుడ్ న‌యా ట్రెండ్ ఫిట్ నెస్ రీల్స్..! ..అవును ఇప్పుడు టాలీవుడ్ తార‌లు ఇన్ స్టాగ్రామ్ లో ఫిట్ నెస్ రీల్స్ ని అప్ లోడ్ చేయ‌డంలో బిజీ బిజీ. తాము ఫిట్ గా ఉండ‌టానికి గ‌ల‌ బ్యాక్ స్టోరీని హార్డ్ వ‌ర్క్ ని చిన్న చిన్న వీడియోలుగా రెడీ చేసి .. ఆ వీడియోకి త‌గ్గ‌ట్లుగా సౌండ్ యాడ్ చేయించి త‌మ ఇన్ స్టా లో రీల్స్ గా అప్ లోడ్ చేస్తున్నారు.

టాలీవుడ్ యువ‌హీరో అల్లు శిరీష్ ఇటీవ‌లే ఈ ట్రెండ్ ని ఫాలో అవుతూ ఓ ఫిట్ నెస్ రీల్ పోస్ట్ చేశారు. త‌న లేటెస్ట్ ఫిట్ లుక్స్ తో ఫాలోవ‌ర్స్ ని ఆక‌ర్షించారు. ఆ త‌రువాత రౌడీ విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా ఇదే త‌ర‌హా వీడియోని రెడీ చేయించి లైగ‌ర్ కోసం తాను ఎంత శ్ర‌మ ప‌డుతున్నాడో అభిమానుల‌కు చూపించాడు. ఇక `గ‌ని` కోసం వెయిట్ త‌గ్గి మిస్ట‌ర్ ఫిట్ గా రెడీ అయ్యాను!! అని ఓ ఫిట్ నెస్ రీల్ పోస్ట్ చేశాడు మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్. అలాగే అవ‌స‌రానికి త‌గ్గ‌ట్టు బాడీ పెంచుతున్న వీడియోలను కూడా వ‌రుణ్ తేజ్ షేర్ చేయ‌గా వైర‌ల్ అయ్యాయి.

ఫిట్నెస్ రీల్స్ లో క‌థానాయిక‌లు త‌క్కువేమీ కాదు. తాజాగా రాశీ ఖ‌న్నా కూడా ఈ ఫిట్ నెస్ ట్రెండ్ ని ఫాలో అయింది. త‌న నాజుకు అందాల్ని ఓ వీడియోగా మ‌లిచి సోష‌ల్ మీడియాల్లో పోస్ట్ చేసింది.

బాలీవుడ్ లో ఈ ట్రెండ్ చాలా కాలంగా ఉన్న‌దే. అక్క‌డ మ‌లైకా అరోరాఖాన్ .. జాన్వీ క‌పూర్.. అన‌న్య పాండే.. సారా అలీఖాన్ .. క‌త్రిన‌.. క‌రీనా.. ఇలా స్టార్లంతా త‌మ ఫిట్నెస్ రీల్స్ ని షేర్ చేస్తూనే ఉన్నారు. శిల్పా శెట్టి లాంటి భామ‌లు యోగా.. ఎక్స‌ర్ సైజుల క్లిప్స్ ని నేరుగా సోష‌ల్ మీడియాల్లో షేర్ చేస్తున్నారు.

హాలీవుడ్ లో ఇలాంటి ట్రెండ్ అప్ప‌ట్లో గ‌ట్టిగా న‌డిచింది. హాలీవుడ్ హీరోలు విల్ స్మిత్- క్రిస్ హ్రెమ్స్ వ్రాత్ వంటి వారు ఇలానే ఫిట్ నెస్ రీల్స్ పోస్ట్ చేసి కొన్నాళ్లు పాటు ఓ ట్రెండ్ క్రియేట్ చేశారు. ఆ ట్రెండ్ నెమ్మ‌దిగా బాలీవుడ్ కి అక్క‌డ నుంచి టాలీవుడ్ కి పాకింది.

టాలీవుడ్ సెల‌బ్రిటీలు మెజారిటీ పార్ట్ 360 ఫిట్నెస్ సెంట‌ర్ .. అపోలో ఫిట్నెస్ సెంట‌ర్ లో ఈ త‌ర‌హా వీడియోల‌ను చేస్తున్నారు. ర‌కుల్ - స‌మంత లాంటి స్టార్లు ఇంత‌కుముందు అపోలో ఫిట్నెస్ సెంట‌ర్ లో ఉపాస‌న‌తో క‌లిసి ఈ త‌ర‌హా వీడియోల‌ను రూపొందించిన సంగ‌తి తెలిసిందే. ఈ త్ర‌యం ఫిట్నెస్ త‌ర‌గతుల‌ను కూడా చెప్పారు. అలాగే ఉపాస‌న -ర‌కుల్ జోడీ ఇంత‌కుముందు ఫిట్నెస్ పై వీడియో క్లాస్ తీస్కున్న సంగ‌తి తెలిసిందే. ర‌కుల్ - సామ్ -ఉపాస‌న ప్ర‌త్యేకించి ఆరోగ్య‌సూత్రాలు వంట‌కాల‌పైనా వీడియోల‌ను ప్ర‌ద‌ర్శించారు.

చిరంజీవి.. రామ్ చ‌ర‌ణ్‌.. అల్లు అర్జున్.. ప్ర‌భాస్ .. రానా.. బ‌న్ని ఇలా స్టార్లంతా నిరంత‌రం జిమ్ముల్లో క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. అయితే వీళ్లంతా ఫిట్నెస్ రీల్స్ ని రిలీజ్ చేయ‌డం లేదు. ఒక‌వేళ త‌మ ఫేవ‌రెట్ స్టార్లు ఈ త‌ర‌హా రీల్స్ తో దూసుకొస్తే అది ఫ్యాన్స్ లో స్ఫూర్తి నింపుతుంద‌న‌డంలో సందేమ‌మేం లేదు.