Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో ఫస్ట్‌ టైమ్ 'కార్తికేయ 2' డబ్బింగ్ ఇక్కడే!

By:  Tupaki Desk   |   1 Sep 2022 7:30 AM GMT
టాలీవుడ్ లో ఫస్ట్‌ టైమ్ కార్తికేయ 2 డబ్బింగ్ ఇక్కడే!
X
తెలుగు స్టార్‌ హీరోల సినిమాలు మరియు మీడియం రేంజ్ సినిమాలు ఈ మధ్య కాలంలో దాదాపు అన్ని ఇండియన్ భాషల్లో డబ్ అవుతున్న విషయం తెల్సిందే. తెలుగు సినిమాలను డబ్బింగ్‌ చేయాలంటే చెన్నై లేదా ముంబయిలో చేయడం ఇన్నాళ్లుగా వస్తున్న పద్ధతి. ఇతర భాషల్లో డబ్ చేయాలంటే చిత్ర యూనిట్ సభ్యులు ఆయా రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చేది.

కానీ ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. టాలీవుడ్ లో ఫస్ట్‌ టైమ్‌ కార్తికేయ 2 సినిమాకు అన్ని భాషల్లో కూడా డబ్బింగ్‌ ను హైదరాబాద్‌ లోనే నిర్వహించారు. పోస్ట్ ప్రో అనే కంపెనీ హైదరాబాద్‌ లో డబ్బింగ్ స్టూడియోను ఏర్పాటు చేసి వివిధ భాషలకు చెందిన డబ్బింగ్‌ ఆర్టిస్టులను ఇక్కడికే తీసుకు వచ్చి వారితో డబ్బింగ్‌ చెప్పిస్తున్నారు.

హైదరాబాద్‌ లోనే కార్తికేయ 2 సినిమాకు అన్ని భాషల్లో డబ్బింగ్‌ చెప్పించిన పోస్ట్‌ ప్రో కంపెనీ వారికి నిర్మాతలు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఎక్కడికో వెళ్లి సినిమాకు డబ్బింగ్‌ చెప్పించుకోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అన్ని పనులు పూర్తి అయ్యేలా సహకరించిన పోస్ట్‌ ప్రో వారికి కృతజ్ఞతలు అంటూ కార్తికేయ 2 నిర్మాతలు ప్రెస్ నోట్‌ ను రివీల్‌ చేశారు.

సినిమాకు సంబంధించిన అన్ని భాషల డబ్బింగ్‌ కార్యక్రమాలు ఒకే చోట అది కూడా హైదరాబాద్‌ లో జరగడం వల్ల దర్శకుడు దగ్గర ఉండి డబ్బింగ్ పనులను పర్యవేక్షించుకునే అవకాశం దక్కిందని కార్తికేయ 2 నిర్మాతలు పేర్కొన్నారు.

భారీ బ్లాక్ బస్టర్‌ సక్సెస్ దక్కించుకున్న కార్తికేయ 2 సినిమా ఇప్పటికే వంద కోట్ల వసూళ్లను క్రాస్ చేసిన విషయం తెల్సిందే. ఇప్పటికి కూడా ఉత్తర భారతంలో మంచి షేర్‌ ను రాబడుతూనే ఉందట.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.