Begin typing your search above and press return to search.

నెట్ ఫ్లిక్స్ సిరీస్ ఆ 10 ఎపిసోడ్లు ఊపిరాడితే ఒట్టు

By:  Tupaki Desk   |   5 Jun 2021 6:00 AM IST
నెట్ ఫ్లిక్స్ సిరీస్ ఆ 10 ఎపిసోడ్లు ఊపిరాడితే ఒట్టు
X
నెట్ ఫ్లిక్స్ సిరీస్ ల‌లో `మ‌నీ హీస్ట్` సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రెండు సీజ‌న్లు బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తో న‌డిచాయి. ఇప్పుడు మూడో సీజ‌న్ స్ట్రీమింగ్ కి రంగం సిద్ధ‌మ‌వుతోంది. రాబ‌రీల నేప‌థ్యంలో క‌థాంశంతో థ్రిల్స్ భారీ యాక్ష‌న్ తో ఆస‌క్తిని రేకెత్తించే సిరీస్ ఇది. కొత్త సీజ‌న్ ఎపిసోడ్స్ ని మిస్స‌య్యేందుకు అభిమానులు ఏమాత్రం ఆస‌క్తిగా లేరు. అందుకే ఈసారి సీజ‌న్ రాక కోసం ఎంతో ఉత్కంఠ కొన‌సాగుతోంది. మ‌రో 92 రోజుల్లోనే మ‌నీహీస్ట్ సీజ‌న్ 3 స్ట్రీమింగుకి రానుంది.

మునుప‌టితో పోలిస్తే చాలా హైప్ తో వ‌స్తున్న ఈ సిరీస్ కి సంబంధించిన ఫోటోల బంచ్ అభిమానుల్లో వైర‌ల్ గా మారింది. ఇన్ స్పెక్టర్ అలిసియా సియెర్రా ప్రొఫెసర్ రహస్య స్థావరాన్ని కనుగొనే సీన్.. దొంగ‌ల ముఠా థ్రిల్స్ కి సంబంధించిన‌ ఫోటోలు ఆక‌ట్టుకుంటున్నాయి. వెప‌న్స్ తో గ‌గుర్పొడిచే భారీ యాక్షన్ సన్నివేశాలతో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే సిరీస్ ఇది.

నాలుగేళ్ల క్రితం ప్రారంభమైన స్పానిష్ హీస్ట్ థ్రిల్లర్ సిరీస్ అద్భుత‌మైన‌ స్క్రీన్ ప్లేతో ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురిచేసింది. ఇప్పటివరకు రెండు సీజన్లలో రెండు భాగాలు చొప్పున ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈసారి రెండు వాల్యూమ్ ల‌తో కొత్త సీజ‌న్ కొన‌సాగుతోంది. ఇది ఐదు ఎపిసోడ్లతో రెండు విడతలుగా విడుదలవుతుంది. ముగింపు వాల్యూమ్ 1 సెప్టెంబర్ 3 న విడుదల కాగా.. వాల్యూమ్ 2 ఈ సంవత్సరం డిసెంబర్ 3 న విడుద‌ల‌వుతుంది.