Begin typing your search above and press return to search.

బ్రేకింగ్‌ : కెమెరా ముందుకు వచ్చిన నాగ్‌ దానికోసమేగా?

By:  Tupaki Desk   |   1 Aug 2020 8:10 AM GMT
బ్రేకింగ్‌ : కెమెరా ముందుకు వచ్చిన నాగ్‌ దానికోసమేగా?
X
గత రెండు నెలలుగా తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 గురించిన చర్చ జనాల్లో విపరీతంగా జరుగుతోంది. హోస్ట్‌ ఎవరు కంటెస్టెంట్స్‌ ఎవరు అనే చర్చకు ఒక్కటి ఒక్కటిగా ఫుల్‌ స్టాప్‌ పడబోతుంది. ఇప్పటికే హోస్ట్‌ నాగార్జున అనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. నాగార్జున నేటి నుండి షూటింగ్‌ లో కూడా పాల్గొంటున్నాడు. ఈ విషయాన్ని నేడు ఆయనే స్వయంగా ట్విట్టర్‌ లో తెలియజేశాడు. మళ్లీ షూటింగ్‌ లైట్స్‌ కెమెరా యాక్షన్‌ వావ్‌ అంటూ ట్విట్టర్‌ లో ఈ ఫొటోలు పెట్టి వ్యాఖ్య ట్వీట్‌ చేశారు.

సూటు మరియు స్టైల్‌ చూస్తుంటే ఖచ్చితంగా ఇది బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 కు సంబంధించిన యాడ్‌ అయ్యి ఉంటుందనిపిస్తుంది. ఈ నెల చివరి నుండి బిగ్‌ బాస్‌ కొత్త సీజన్‌ ప్రారంభం కానున్నట్లుగా స్టార్‌ మా వర్గాల వారు ఇప్పటికే అనధికారికంగా చెప్పేశారు. కంటెస్టెంట్స్‌ జాబిత కూడా దాదాపుగా రెడీ అయ్యింది. ఈ సమయంలో షోకు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం నాగార్జునతో కొన్ని ప్రోమో వీడియోలు చేయబోతున్నారు. ఈ నెల రోజులు స్టార్‌ మాలో ఆ వీడియోలను ప్రసారం చేయబోతున్నారు.

నాగార్జున షూటింగ్‌ లో మేకప్‌ మన్‌ మరియు హెయిర్‌ డ్రస్సర్‌ ఇతరులు అంతా కూడా పీపీఈ కిట్స్‌ ధరించి ఉన్నారు. అంటే షూటింగ్‌ కు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని నాగ్‌ సింబాలిక్‌ గా చెప్పాడు అన్నమాట. నాగార్జున బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 కు భారీ పారితోషికం తీసుకుంటున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆయన స్వయంగా ఇలా ట్విట్టర్‌ లో ఈ ఫొటోలు పెట్టడంతో ఇది బిగ్‌ బాస్‌ ప్రోమో షూట్‌ అంటూ అంతా నమ్మకంగా చెబుతున్నారు. అయితే అసలు విషయం ఏంటీ అనేది అధికారికంగా స్టార్‌ మా కాని నాగార్జున టీం కాని క్లారిటీ ఇవ్వలేదు.